ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు | Fire breaks out at a plastic factory in Thane | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

Published Sun, Nov 6 2016 11:07 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు - Sakshi

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

థానే: మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. థానేలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మొదట ఓ రూమ్లో చిన్నగా మంటలు వచ్చాయి. తర్వాత కొంతసేపటికే మంటలు ఫ్యాక్టరీ మొత్తాన్ని వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు.

సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే దాదాపు ఫ్యాక్టరీలోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. 10  ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోనికి తెచ్చేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ఎంతమేరకు నష్టం వాటిల్లిందో తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement