
సాగరకన్య పుట్టిందట!
పురాణాలకు, సినిమాలకు మాత్రమే పరిమిమైన మత్స్యకన్యలు ఇపుడు నిజంగానే మనదేశంలో ఉన్నారా..పంజాబ్ లోని అమృతసర్లో పుట్టిన అరుదైన పసిపాప ను చూస్తే అవుననే అనిపిస్తోంది.
అమృతసర్: పురాణాలకు, సినిమాలకు మాత్రమే పరిమిమైన మత్స్యకన్యలు ఇపుడు నిజంగానే మన దేశంలో ఉన్నారా.. పంజాబ్ లోని అమృతసర్ లో పుట్టిన అరుదైన పసిపాపను చూస్తే అవుననే అనిపిస్తోంది. సాహసవీరుడు సాగరకన్య సినిమాలోని మత్స్యకన్య గుర్తుందా.. అచ్చం అలాంటి లక్షణాలతోనే చేపలాంటి ముఖంతో, రబ్బరు బొమ్మలా ఉండి , చర్మం పొలుసులు తేలి ఉన్న ఓ పాప జన్మించింది. రాజ్సాన్సీ గ్రామంలో పుట్టిన ఆమెను గురునానక్ దేవ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్లాస్టిక్ బేబీగా కనిపించే ఇలాంటి పిల్లలను వైద్యపరిభాషలో 'కొల్లోడియన్ బేబీ' అంటారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన పిల్లలు ఆరు లక్షల మందిలో ఒకరు ఉంటారని గురునానక్ దేవ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్యుడు డా. పన్ను తెలిపారు.
చేపను పోలిన ముఖంతో పుట్టిన ఈ పాప పెదాలు, కళ్ళు ఎర్రగా ఉన్నాయనీ, ముట్టుకుంటే ఏడుస్తోందని.. కనీసం తల్లిపాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉందని వారంటున్నారు. జన్యు లోపాల వల్ల ఇలాంటి పిల్లలు పుడతారని 10-15 రోజులకు చర్మం పై పగుళ్లు వచ్చి పొలుసుల్లా రాలిపోతుందని.. ఈ సమయంలో భరించలేని నొప్పి ఉంటుందన్నారు. జీవితాంతం ఈ బాధను వారు భరించాల్సిందేనని ఆయన తెలిపారు.
మైనంలాగా మెరిసే , గట్టిగా ఉండే చర్మంతో పుట్టిన ఇలాంటి పాపకు తాను గతంలో చికిత్స చేశానని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డా. ఆర్ఎస్ బేదీ తెలిపారు. చర్మం పొలుసులుగా రాలిపోయే సమయంలో కనీసం కనుగుడ్లను కూడా మూయలేనంత తీవ్ర బాధను అనుభవిస్తారని తెలిపారు. ఇతర సమస్యలతో, ఇన్ఫెక్షన్లు, హైపోడెర్మియా, డీహైడ్రేషన్ పట్టి పీడిస్తాయిని వారంటున్నారు. అమృతసర్లో 2014 నుంచి ఇప్పటి వరకు ప్లాస్టిక్ బేబీ ఒకరు మాత్రమే ఇలా జన్మించారనీ, ఈ బేబీ రెండోదని సమాచారం. గతంలో చండీగఢ్ సివిల్ ఆస్పత్రిలో పుట్టిన ఈ పాప మూడు రోజుల తర్వాత చనిపోయిందని వైద్యులు చెబుతున్నారు.