
భారత్‌లో ఓకేప్లే షోరూమ్
ఓకే ప్లే కంపెనీ భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను గుర్గావ్‌లోని ఆంబియాన్స్ మాల్‌లో ఏర్పాటు చేసింది. ఏడాది కాలంలో 40 స్టోర్స్
హైదరాబాద్: ఓకే ప్లే కంపెనీ భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను గుర్గావ్‌లోని ఆంబియాన్స్ మాల్‌లో ఏర్పాటు చేసింది. ఏడాది కాలంలో 40 స్టోర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ సంస్థ ప్లాస్టిక్ మౌల్డెడ్ ఆట బొమ్మలను, ఫన్-స్టేషన్లను, పిల్లల ఫర్నీచర్‌ను విక్రయిస్తున్నామని ఓకే ప్లే ఇండియా ఎండీ, ఎం. రాజన్ హండా ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఇంగ్లాండ్‌లో పేరెన్నిక కన్న బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చకున్నామని పేర్కొన్నారు. అన్ని వయస్సులవారికి ఉపయోగపడే విభిన్నమైన, వినూత్నమైన బ్రాండ్లను అందిస్తున్నామని పేర్కొంది.