
చెన్నై, టీ.నగర్: పుదుక్కోటై జిల్లా కీరమంగళం, వడకాడు పరిసర గ్రామాలు, తంజావూరు జిల్లా పేరావూరణి నియోజకవర్గాల్లో గల గ్రామాల్లో గత 25 ఏళ్లుగా చదివింపు విందులు జరుగుతున్నాయి. వివాహం, ఇతర శుభకార్యాలకు డబ్బు అవసరం ఉన్నవారు ఈ చదివింపు విందులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గురువారం వడకాడులో కృష్ణమూర్తి అనే రైతు భారీ స్థాయిలో చదివింపు విందు నిర్వహించారు. ఇందుకోసం పెద్ద పందిరి ఏర్పాటుచేసి విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి 50 వేల ఆహ్వానపత్రికలు ముద్రించి పంచిపెట్టారు. ఒక టన్ను మేకమాంసాన్ని వండి మాంసాహార భోజనం వడ్డించారు. విందుకు వచ్చిన వారు చదివింపుగా ఇచ్చే నగదును లెక్కించేందుకు ప్రైవేటు బ్యాంకు సిబ్బందితో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా సుమారు 20 చోట్ల చదివింపులు రాశారు. సాయుధ భద్రతా సిబ్బంది భద్రతా విధులు చేపట్టారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వసూలయిన నగదును లెక్కించగా రూ.4 కోట్లు లెక్క తేలింది. ఈ ఏడాది ఇదే అత్యదిక మొత్తంలో వసూలయిన చదివింపుల సొమ్ముగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment