
హన్మకొండ: సీఎం వరంగల్ పర్యటన సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా మటన్, తలకాయ కూర, చికెన్‌తోపాటు చేపలు, రొయ్యల ఫ్రై, నాటుకోడి పులుసు, చికెన్ దమ్ బిర్యానీ చేయించారు. శాకాహారంగా పెసరపప్పు టమాటా, బీరకాయ కూర, బెండకాయ ఫ్రై, టమాటా– పుదీనా పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి, రైతా, పెరుగు, ఫ్రూట్ సలాడ్, మరో స్వీట్ సిద్ధం చేశారు.
మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భోజనానికి హాజరైన సీఎం కేసీఆర్.. అందులో పలు వంటలు రుచిచూసి చివరగా దానిమ్మ జ్యూస్ తాగారు. అన్ని వంటలు బాగున్నా యని, ఎప్పుడు వరంగల్ వచ్చినా భోజనానికి శ్రీహరి ఇంటికే రావాలని ఉందని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మనవరాలు అన్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా.. చిన్నారిని కేసీఆర్ ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment