లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మ్యాచ్ గెలిచినప్పటి నుంచి కొనసాగిస్తున్న సంబరాలు.. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా భార్య అనుష్క శర్మతో కలిసి డేట్‌కు వెళ్లిన విరాట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. లండన్‌లోని టెండ్రిల్ రెస్టారెంట్‌కు వెళ్లిన విరుష్కలు అక్కడ తమకు ఇష్టమైన ఆహారాన్ని లాగించారు. అనంతం తాము నచ్చే విధంగా మీల్స్ తయారు చేసినందుకు కృతజ్ఞతగా చెఫ్‌తో కలిసి ఒక ఫోటో దిగారు.
ఈ విషయాన్ని టెండ్రిల్ రెస్టారెంట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈరోజు మా రెస్టారెంట్‌కు కోహ్లి, అనుష్కలు లంచ్‌కు వచ్చారు. వారికి నచ్చే విధంగా మీల్స్ తయారు చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. మేం చాలా ఎంజాయ్ చేశాం అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక కోహ్లి తొలి రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మన్‌గా విఫలమైనప్పటికీ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. రెండు టెస్టులు కలిపి కోహ్లి 0, 42, 20 పరుగులు చేశాడు. మూడో టెస్టుకు టీమిండియాకు వారం రోజులు గ్యాప్ ఉండడంతో క్రికెటర్లు ఉన్న సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా మూడో టెస్టు జరగనుంది.
🇮🇳's wagging tail, 10 English wickets and the special running celebrations sealed the deal for India at Lord's 🙌🏽
— Sony Sports (@SonySportsIndia) August 16, 2021
Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #ENGvIND #ENGvsIND pic.twitter.com/ECZY9OVRyu
Comments
Please login to add a commentAdd a comment