తృప్తిగా.. కడుపు నిండుగా..మధ్యాహ్న భోజనం | Jagananna Gorumudda Scheme: AP | Sakshi
Sakshi News home page

తృప్తిగా.. కడుపు నిండుగా..మధ్యాహ్న భోజనం

Published Mon, Jan 15 2024 4:21 AM | Last Updated on Mon, Jan 15 2024 6:00 AM

Jagananna Gorumudda Scheme: AP - Sakshi

నాడు

  • నీళ్ల సాంబారు, ముద్ద అన్నం
  • పప్పుకు, రసానికి తేడానే ఉండదు
  • పేరుకే ఏటా రూ.450 కోట్ల బడ్జెట్‌
  • సరుకులకు డబ్బు చెల్లింపులో తీవ్ర జాప్యం
  • సరుకులు ఎవరెవరో ఇళ్లకు ఎత్తుకుపోయే పరిస్థితి
  • వంట వాళ్లనూ పట్టించుకోని వైనం
  • ఎవరికీ పట్టని భోజనం నాణ్యత 
  • వంటశాల లేక స్కూలంతా పొగ
  • సగటున 50 శాతం మంది విద్యార్థులకే భోజనం


అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజనం కోసం ఎండలో క్యూలైన్లో వేచిఉన్న విద్యార్థులు

నేడు

  • రోజుకో మెనూ చొప్పున మొత్తంగా 16 రకాల ఐటమ్స్‌
  • గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం
  • సగటున 90% మంది విద్యార్థులకు భోజనం
  • భోజనం పూర్తయ్యాక ఆహారంపై ఆరా.. బాగుంటే ‘గుడ్‌’ లేకుంటే ‘నాట్‌ గుడ్‌’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ
  • నాణ్యత కోసం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి తినే ఏర్పాటు
  • ఎంత మంది భోజనం చేస్తున్నారో ఆన్‌లైన్‌లో పక్కాగా రికార్డు
  • 43 లక్షల మంది ప్రతి రోజూ సంతృప్తికరంగా భోజనం
  • సోమవారం హాట్‌ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్‌ పులావు, గుడ్డు కూర, చిక్కీ
  • మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు
  • బుధవారం వెజిటబుల్‌ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ
  • గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌ బాత్‌/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు
  • శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
  • శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్‌ పొంగల్‌ 
  • 2019–20లో రూ.979.48 కోట్లు, 2020–21లో రూ.1,187.49 కోట్లు, 2021–22లో రూ.1,840.05 కోట్లు, 2022–23లో రూ.1,548.58 కోట్లు, 2023–24లో రూ.1,689 కోట్లు బడ్జెట్‌
  • ప్రత్యేకంగా వంట గది, ఎప్పటికప్పుడు బిల్లులు

విద్యార్థులకు తరగతి గది పక్కన వరండాల్లో భోజనం పెడుతున్న దృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement