నిధులివ్వలేక చేతులెత్తేసిన సర్కారు
తాజాగా పీఎంఏవై-జీ పథకం తెరపైకి
13 నిబంధనలతో లబ్ధిదారుల కుదింపు
గ్రామసభల్లో మరింత వడపోత
ల్యాండ్‌లైన్ ఫోనుందా.. అయితే మీరు ఎంతటి పేదలైనా ప్రభుత్వ గృహం పొందేందుకు అర్హతలేనట్టే. ఇది సాక్షాత్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు. డబుల్ బెడ్‌రూం గృహాలంటూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గానికి 1,250 గృహలను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. ఏడాదైనా నిర్మాణాలకు దిక్కులేదు. ఒక్క పైసా కూడా విదల్చలేదు. గత ఏప్రిల్14న ఈ పథకానికి నియోజకవర్గాల్లో శిలాఫలకాలు వేయించి చేతులు దులుపుకుంది. కేంద్రం ఇచ్చే పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాజ్‌యోజన (గ్రామీణ) పథకం) నిధులు, గృహాలపైనే ఆధారపడింది. ఫలితంగా పేదలకు గృహాలు దక్కే పరిస్థితులు లేకుండాపోతోంది.
బి.కొత్తకోట: ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకానికి అడుగడుగునా అవాంతరాలే. నిర్మిస్తారో లేదో తెలియని ఇళ్లకు సవాలక్ష నిబంధనలను ప్రభుత్వం విధించింది. జిల్లాలో ఈ పథకం కింద మంజూరుచేసిన గృహాలకు 50శాతం స్థలాలున్న, 50 శాతం స్థలాలులేని లబ్ధిదారులను గుర్తించాలి. ఇందులో ఇళ్లస్థలాలు కలి గిన 8,575 మంది జాబితాకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆమోద ముద్రవేశారు. నిర్మాణాలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఒక్కఇంటి నిర్మాణమైనా ప్రారంభం కాలేదు. ఈనేపథ్యంలో పీఎంఏవై పథ కం ద్వారా కేంద్రం నుంచి నిధులు పొం దేందుకు సిద్ధపడింది. లబ్ధిదారుల జాబితాను నిబంధనల పేరిట వడపోసి కొందర్నే అర్హులుగా చేయాలని సిద్ధమైంది.
పీఎంఏవై పథకమే దిక్కు..
ప్రభుత్వం ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ.2.75లక్షలతో ఇంటినిచేపట్టేందుకు నిర్ణయించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు రూ.1.75లక్షలు, ఇతరులకు రూ.1.25లక్షలు సబ్సిడీగా, మిగిలి నది రుణంగా ప్రకటించిం ది. ఈ నిధుల కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రగృహ పథకం నిధులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంఏవై పథకం కింద లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి నివేదిస్తే
ఎన్టీఆర్ ఇళ్లపై నిబంధనల పిడుగు
ఒక్కోఇంటికి రూ.1.20లక్షలు ఇస్తుంది. దీనికి రాష్ట్రం వాటా కలిపితే ప్రకటించిన యూనిట్ విలువతో గృహాలు నిర్మించేందుకు నిర్ణయించింది. భారం తగ్గించుకునేందుకే దీనికి పూనుకొన్నట్టు స్పష్టం అవుతోంది.
ప్రస్తుత జాబితాలతో గ్రామసభలు
జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకంలో స్థలాలు కలిగిన 50శాతం లబ్దిదారుల జాబితాలతో గ్రామసభలు నిర్వహించనున్నారు. దీనికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని గృహనిర్మాణశాఖ ఈఈ, డీఈ, ఏఈలు, ఎంపీడీఓలు ఈనెల 30లోగా గ్రామసభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామసభలో 13 అంశాల్లో లేనివారిని లబ్దిదారులుగా ఎంపిక చే సినట్లు పంచాయతీ తీర్మానం చేసి పంచాయతీ కార్యదర్శి, సర్పంచులు సంతకాలు చేశాక నివేదికలు జిల్లా కేంద్రానికి పంపాలి. ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధం కాగా కేంద్రనిధుల కోసం ఎంపికచేయగా మిగిలినవారి పరిస్థితి ప్రశ్నార్థకమే. ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ పథకం ఇప్పట్లో అమలుచేసే పరిస్థితి లేకపోవడంతో లబ్దిదారులకు ఎదురుచూపులు తప్పవు.
13లో ఒక్కటున్నా ఇల్లు పుటుక్కే
పీఎంఏవై లబ్దిదారులను ఎంపిక చేసేందుకు విధానం ఉంది. సాంఘిక, సామాజిక, ఆర్థిక, కుల గణంకాల సర్వే-2011 ఆధారంగా ఇళ్ల కేటాయింపులకు అర్హులను గుర్తించాలి. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది. 13 అంశాలకు సంబంధించి కింది ఏ ఒక్క అంశానికి లబ్దిదారులు కలిగివున్నా అనర్హులుగా నిర్ణయిస్తారు.