NTR Rural Housing Scheme
-
చంద్ర‘గృహ’ణం!
∙యూనిట్ కాస్ట్ భారీగా తగ్గింపు ‘ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీం’కు సంబంధించి గత నెల 20న ప్రభుత్వం జీవో నంబర్ 90 జారీ చేసింది. ఇందులో ఇంటి నిర్మాణానికి యూనిట్ కాస్ట్‌ను రూ.2,25,000గా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రూ.72 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.48 వేలు సబ్సిడీ ఇవ్వనుండగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కింద కేంద్ర ప్రభుత్వం రూ.52434 (90 శాతం), రాష్ట్ర ప్రభుత్వం రూ.5826 (10 శాతం) కేటాయించారు. ఐఎస్ఎల్ (వ్యక్తిగత మరుగుదొడ్డి) సబ్సిడీ రూ.3 వేలు, బ్యాంక్ రుణం రూ.43740గా నిర్ణయించారు. మొత్తంగా 300 చదరపు అడుగుల్లో (మరుగుదొడ్డితో కలిపి) ఇంటి నిర్మాణం చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సోమవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ దినేశ్‌కుమార్ జీవో నంబర్ 103 జారీ చేశారు. ఇందులో యూనిట్ కాస్ట్‌తో పాటు విస్తీర్ణం గణనీయంగా తగ్గించారు. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు, ఉపాధి హామీ నిధులు రూ.55 వేలుగా పేర్కొంటూ యూనిట్ కాస్ట్‌ను రూ.1.50 లక్షలకే పరిమితం చేశారు. పైగా 200 చదరపు అడుగుల్లోనే లబ్ధిదారుడు నిర్మాణం చేపట్టాలని అందులో పేర్కొన్నారు. ‘ఉపాధి’ నిధుల ఖర్చుపై సందేహాలు : ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉపాధిహామీ పథకం కింద విడుదలయ్యే నిధుల ఖర్చుపై అప్పుడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో నిధులు విడుదల కాకుంటే నిర్మాణాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఈ పథకం కింద విడుదలయ్యే నిధుల్లో 90 రోజుల పనికి గాను రోజుకు రూ.194 వేతనం చొప్పున కూలికి 17,460, ఇటుకల తయారీకి 25,540, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 ఖర్చు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపుల్లోనూ కోత : జిల్లాకు ఇప్పటికే మంజూరైన ఇళ్లలోనూ ప్రభుత్వం కోత పెట్టింది. గతంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 50, హిందూపురానికి 500, ధర్మవరం, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పుట్టపర్తి, రాయదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాలకు 1,150 ఇళ్లు చొప్పున కేటాయించారు. పెనుకొండకు 1,450, రాప్తాడు, శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాలకు 1,250 ఇళ్లు కేటాయించారు. మొత్తంగా 14,950 ఇళ్లను కేటాయించగా ఇప్పటికే 7925 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే తాజా ఉత్తర్వుల్లో ఇళ్ల సంఖ్యను 11,500కు కుదించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాలు నాలుగు, 50 శాతం.. అంతకంటే ఎక్కువగా గ్రామీణులున్న నియోజకవర్గాలు 8 ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం వీటి పరిధిలో 10,800 (నియోజకవర్గానికి 900) ఇళ్లు మంజూరు చేసింది. పట్టణ ప్రజలున్న రెండు నియోజకవర్గాలకు గాను 700 ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంగా 11,500 ఇళ్లను జిల్లాకు కేటాయించారు. ఇందులో ఎస్సీలకు 1967, ఎస్టీలకు 613, మైనార్టీలకు 688, జనరల్ కేటగిరీకి 8232 ఇళ్లను కేటాయించారు. జన్మభూమి కమిటీలకే పెత్తనం : గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కమిటీ సభ్యులు సభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సభల్లో చదివి ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫైనల్ జాబితాను జిల్లా ఇన్చార్జ్ మంత్రిని సంప్రదించాక జిల్లా కలెక్టర్ తయారు చేయనున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతి కూడా కలెక్టరే ఇవ్వనున్నారు. ప్రక్రియ అంతా ముగిశాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌హెచ్‌సీఎల్) వెబ్సైట్లో లబ్ధిదారుల వివరాలను ఉంచనున్నారు. -
ఎన్టీఆర్ ఇళ్లపై నిబంధనల పిడుగు
నిధులివ్వలేక చేతులెత్తేసిన సర్కారు తాజాగా పీఎంఏవై-జీ పథకం తెరపైకి 13 నిబంధనలతో లబ్ధిదారుల కుదింపు గ్రామసభల్లో మరింత వడపోత ల్యాండ్‌లైన్ ఫోనుందా.. అయితే మీరు ఎంతటి పేదలైనా ప్రభుత్వ గృహం పొందేందుకు అర్హతలేనట్టే. ఇది సాక్షాత్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు. డబుల్ బెడ్రూం గృహాలంటూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గానికి 1,250 గృహలను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. ఏడాదైనా నిర్మాణాలకు దిక్కులేదు. ఒక్క పైసా కూడా విదల్చలేదు. గత ఏప్రిల్14న ఈ పథకానికి నియోజకవర్గాల్లో శిలాఫలకాలు వేయించి చేతులు దులుపుకుంది. కేంద్రం ఇచ్చే పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాజ్‌యోజన (గ్రామీణ) పథకం) నిధులు, గృహాలపైనే ఆధారపడింది. ఫలితంగా పేదలకు గృహాలు దక్కే పరిస్థితులు లేకుండాపోతోంది. బి.కొత్తకోట: ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకానికి అడుగడుగునా అవాంతరాలే. నిర్మిస్తారో లేదో తెలియని ఇళ్లకు సవాలక్ష నిబంధనలను ప్రభుత్వం విధించింది. జిల్లాలో ఈ పథకం కింద మంజూరుచేసిన గృహాలకు 50శాతం స్థలాలున్న, 50 శాతం స్థలాలులేని లబ్ధిదారులను గుర్తించాలి. ఇందులో ఇళ్లస్థలాలు కలి గిన 8,575 మంది జాబితాకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోద ముద్రవేశారు. నిర్మాణాలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఒక్కఇంటి నిర్మాణమైనా ప్రారంభం కాలేదు. ఈనేపథ్యంలో పీఎంఏవై పథ కం ద్వారా కేంద్రం నుంచి నిధులు పొం దేందుకు సిద్ధపడింది. లబ్ధిదారుల జాబితాను నిబంధనల పేరిట వడపోసి కొందర్నే అర్హులుగా చేయాలని సిద్ధమైంది. పీఎంఏవై పథకమే దిక్కు.. ప్రభుత్వం ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ.2.75లక్షలతో ఇంటినిచేపట్టేందుకు నిర్ణయించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు రూ.1.75లక్షలు, ఇతరులకు రూ.1.25లక్షలు సబ్సిడీగా, మిగిలి నది రుణంగా ప్రకటించిం ది. ఈ నిధుల కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రగృహ పథకం నిధులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంఏవై పథకం కింద లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి నివేదిస్తే ఎన్టీఆర్ ఇళ్లపై నిబంధనల పిడుగు ఒక్కోఇంటికి రూ.1.20లక్షలు ఇస్తుంది. దీనికి రాష్ట్రం వాటా కలిపితే ప్రకటించిన యూనిట్ విలువతో గృహాలు నిర్మించేందుకు నిర్ణయించింది. భారం తగ్గించుకునేందుకే దీనికి పూనుకొన్నట్టు స్పష్టం అవుతోంది. ప్రస్తుత జాబితాలతో గ్రామసభలు జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకంలో స్థలాలు కలిగిన 50శాతం లబ్దిదారుల జాబితాలతో గ్రామసభలు నిర్వహించనున్నారు. దీనికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని గృహనిర్మాణశాఖ ఈఈ, డీఈ, ఏఈలు, ఎంపీడీఓలు ఈనెల 30లోగా గ్రామసభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామసభలో 13 అంశాల్లో లేనివారిని లబ్దిదారులుగా ఎంపిక చే సినట్లు పంచాయతీ తీర్మానం చేసి పంచాయతీ కార్యదర్శి, సర్పంచులు సంతకాలు చేశాక నివేదికలు జిల్లా కేంద్రానికి పంపాలి. ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధం కాగా కేంద్రనిధుల కోసం ఎంపికచేయగా మిగిలినవారి పరిస్థితి ప్రశ్నార్థకమే. ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ పథకం ఇప్పట్లో అమలుచేసే పరిస్థితి లేకపోవడంతో లబ్దిదారులకు ఎదురుచూపులు తప్పవు. 13లో ఒక్కటున్నా ఇల్లు పుటుక్కే పీఎంఏవై లబ్దిదారులను ఎంపిక చేసేందుకు విధానం ఉంది. సాంఘిక, సామాజిక, ఆర్థిక, కుల గణంకాల సర్వే-2011 ఆధారంగా ఇళ్ల కేటాయింపులకు అర్హులను గుర్తించాలి. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది. 13 అంశాలకు సంబంధించి కింది ఏ ఒక్క అంశానికి లబ్దిదారులు కలిగివున్నా అనర్హులుగా నిర్ణయిస్తారు. -
గూడు గోడు
జిల్లా వ్యాప్తంగా 14,950 ఇళ్లు.. రూ.433 కోట్ల నిధులు.. 7,925 మంది లబ్ధిదారులు.. కేవలం 47 ఇళ్లకు మాత్రమే పరిపాలన అనుమతి ... ఇదీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం పనితీరు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఈ పథకం పురోగతి ఏ మాత్రం లేదు. అనంతపురం: ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలోనూ తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. హిందూపురం, అనంతపురం నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి స్థాయిలో జరిగింది. పెనుకొండ, రాప్తాడు, రాయదుర్గం నియోజవకర్గాల పరిధిలో 75 శాతం మించింది. ధర్మవరం నియోజవకర్గానికి 1,150 మంజూరు చేస్తే కేవలం 78 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఆఖరి స్థానంలో నిలిచింది. తక్కిన చోట్ల 50 శాతం నుంచి 40 శాతం మేర లబ్ధిదారుల ఎంపిక జరిగింది. 47 ఇళ్ల కే పరిపాల అనుమతి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 14,950 ఇళ్లను కేటాయించగా, అంచనా వ్యయం రూ.433.55 కోట్లుగా నిర్ధారించారు. సీఎం డ్యాష్ బోర్డ్ అధికారికంగా హౌసింగ్ సంస్థ ఉంచిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 7,925 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులోనూ కేవలం 47 ఇళ్లకు మాత్రమే పరిపాలన అనుమతి లభించింది. అదీ కూడా అనంతపురం నియోజకవర్గం పరిధిలో 50 ఇళ్లు మంజూరైతే ఇందులో 47 మంది లబ్ధిదారుల జాబితా తయారైంది. ఈ 47కు మాత్రమే పరిపాలన అనుమతి ఇచ్చారు. మిగతా 13 నియోజకవర్గాల పరిధిలో ఒక్క ఇంటికీ పరిపాలనా అనుమతి మంజూరు కాలేదు.