మలేషియా ప్రధానికి స్పెషల్‌ మిల్లెట్‌ లంచ్‌..మెనూలో ఏం ఉన్నాయంటే..! | Modi Honours Prime Minister Of Malaysia With A Millet Forward Fusion Lunch | Sakshi
Sakshi News home page

మలేషియా ప్రధానికి స్పెషల్‌ మిల్లెట్‌ లంచ్‌..మెనూలో ఏం ఉన్నాయంటే..!

Published Wed, Aug 21 2024 1:40 PM | Last Updated on Wed, Aug 21 2024 1:45 PM

Modi Honours Prime Minister Of Malaysia With A Millet Forward Fusion Lunch

మలేషియా ప్రధాని అన్వర్‌ బిన్‌ ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అన్వర్‌బిన్‌కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ భారతీయ మలయ్‌ వంటకాల తోపాటు మిల్లెట్లను హైలెట్‌ చేసేలా గ్రాండ్‌ లంచ్‌ను ఏర్పాటు చేశారు. మెనూలో ఏం ఉన్నాయంటే..

మెనూలో  భారతీయ, ఆగ్నేయాసియా రుచులను అందంగా మిళితం చేసేలా విభిన్న వంటకాలను అందించింది. ఇందులో నూడుల్స్‌, కూరగాయలు, స్పైసి వంటకాలు, కొబ్బరితో చేసినవి ఉన్నాయి. ఇక తీపి, కారంతో మిళితం చేసే పెర్ల్ మఖానీ వొంటన్, పెర్ల్ మిల్లెట్, కాటేజ్ చీజ్ తదితరాలు ఉన్నాయి. అలాగే మిక్స్‌డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌తో తయారు చేసినన సలాడ్, రుచికరమైన కబాబ్‌లకు రిఫ్రెష్ బ్యాలెన్స్‌లో ఉల్లిపాయలు, బెంగాలీ పంచ్‌ ఫోరాన్‌ మసాలాలు, జీలకర్రతో వండిన బ్రెజ్డ్‌, బటన్‌ మష్రూమ్‌లు ఉన్నాయి. 

ఇవికాక మిల్లెట్‌కి సంబంధించి రాగి, బచ్చలి, జీడిపప్పతో చేసిన కుడుములు, బంగాళదుంప జీడిపప్పుతో చేసిన మిల్లెట్‌ కుడుము విత్‌ బచ్చలి కూర గ్రేవీ, గుజరాతీ ఖట్టి మీథీ దాల్, పులిహోర తదితరాలతో మలేషియా ప్రధానికి గొప్ప విందును ఏర్పాటు చేశారు మోదీ. కాగా, 2023 అధికారికంగా మిల్లెట్ సంవత్సరంగా  ప్రకటించినప్పటి నుంచి అంతర్జాతీయ ఆదరణ లభించేలా మెల్లెట్స్‌తో ఎలాంటి వైవిధ్యమైన వంటకాలు చేయొచ్చు తెలిపేలా భారతీయ వంటకాలతో చాటి చెబుతోంది. 

(చదవండి: బ్రెయిన్‌ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement