Homes Places
-
ఎన్టీఆర్ ఇళ్లపై నిబంధనల పిడుగు
నిధులివ్వలేక చేతులెత్తేసిన సర్కారు తాజాగా పీఎంఏవై-జీ పథకం తెరపైకి 13 నిబంధనలతో లబ్ధిదారుల కుదింపు గ్రామసభల్లో మరింత వడపోత ల్యాండ్‌లైన్ ఫోనుందా.. అయితే మీరు ఎంతటి పేదలైనా ప్రభుత్వ గృహం పొందేందుకు అర్హతలేనట్టే. ఇది సాక్షాత్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు. డబుల్ బెడ్రూం గృహాలంటూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గానికి 1,250 గృహలను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. ఏడాదైనా నిర్మాణాలకు దిక్కులేదు. ఒక్క పైసా కూడా విదల్చలేదు. గత ఏప్రిల్14న ఈ పథకానికి నియోజకవర్గాల్లో శిలాఫలకాలు వేయించి చేతులు దులుపుకుంది. కేంద్రం ఇచ్చే పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాజ్‌యోజన (గ్రామీణ) పథకం) నిధులు, గృహాలపైనే ఆధారపడింది. ఫలితంగా పేదలకు గృహాలు దక్కే పరిస్థితులు లేకుండాపోతోంది. బి.కొత్తకోట: ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకానికి అడుగడుగునా అవాంతరాలే. నిర్మిస్తారో లేదో తెలియని ఇళ్లకు సవాలక్ష నిబంధనలను ప్రభుత్వం విధించింది. జిల్లాలో ఈ పథకం కింద మంజూరుచేసిన గృహాలకు 50శాతం స్థలాలున్న, 50 శాతం స్థలాలులేని లబ్ధిదారులను గుర్తించాలి. ఇందులో ఇళ్లస్థలాలు కలి గిన 8,575 మంది జాబితాకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోద ముద్రవేశారు. నిర్మాణాలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఒక్కఇంటి నిర్మాణమైనా ప్రారంభం కాలేదు. ఈనేపథ్యంలో పీఎంఏవై పథ కం ద్వారా కేంద్రం నుంచి నిధులు పొం దేందుకు సిద్ధపడింది. లబ్ధిదారుల జాబితాను నిబంధనల పేరిట వడపోసి కొందర్నే అర్హులుగా చేయాలని సిద్ధమైంది. పీఎంఏవై పథకమే దిక్కు.. ప్రభుత్వం ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ.2.75లక్షలతో ఇంటినిచేపట్టేందుకు నిర్ణయించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు రూ.1.75లక్షలు, ఇతరులకు రూ.1.25లక్షలు సబ్సిడీగా, మిగిలి నది రుణంగా ప్రకటించిం ది. ఈ నిధుల కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రగృహ పథకం నిధులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంఏవై పథకం కింద లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి నివేదిస్తే ఎన్టీఆర్ ఇళ్లపై నిబంధనల పిడుగు ఒక్కోఇంటికి రూ.1.20లక్షలు ఇస్తుంది. దీనికి రాష్ట్రం వాటా కలిపితే ప్రకటించిన యూనిట్ విలువతో గృహాలు నిర్మించేందుకు నిర్ణయించింది. భారం తగ్గించుకునేందుకే దీనికి పూనుకొన్నట్టు స్పష్టం అవుతోంది. ప్రస్తుత జాబితాలతో గ్రామసభలు జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకంలో స్థలాలు కలిగిన 50శాతం లబ్దిదారుల జాబితాలతో గ్రామసభలు నిర్వహించనున్నారు. దీనికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని గృహనిర్మాణశాఖ ఈఈ, డీఈ, ఏఈలు, ఎంపీడీఓలు ఈనెల 30లోగా గ్రామసభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామసభలో 13 అంశాల్లో లేనివారిని లబ్దిదారులుగా ఎంపిక చే సినట్లు పంచాయతీ తీర్మానం చేసి పంచాయతీ కార్యదర్శి, సర్పంచులు సంతకాలు చేశాక నివేదికలు జిల్లా కేంద్రానికి పంపాలి. ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధం కాగా కేంద్రనిధుల కోసం ఎంపికచేయగా మిగిలినవారి పరిస్థితి ప్రశ్నార్థకమే. ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ పథకం ఇప్పట్లో అమలుచేసే పరిస్థితి లేకపోవడంతో లబ్దిదారులకు ఎదురుచూపులు తప్పవు. 13లో ఒక్కటున్నా ఇల్లు పుటుక్కే పీఎంఏవై లబ్దిదారులను ఎంపిక చేసేందుకు విధానం ఉంది. సాంఘిక, సామాజిక, ఆర్థిక, కుల గణంకాల సర్వే-2011 ఆధారంగా ఇళ్ల కేటాయింపులకు అర్హులను గుర్తించాలి. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది. 13 అంశాలకు సంబంధించి కింది ఏ ఒక్క అంశానికి లబ్దిదారులు కలిగివున్నా అనర్హులుగా నిర్ణయిస్తారు. -
అడ్డగోలు భూ సేకరణ!
► అధికారుల ఇష్టారాజ్యం ► ఇళ్ల స్థలాలకు మెట్టభూమి ధర ► సోమశిల బాధితులకు తిప్పలు సంగం: నెల్లూరు-ముంబై జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన భూసేకరణ అడ్డగోలుగా జరింది. రహదారి పనుల్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం మంజూరు విషయంలో నిబంధనలు తుంగలో తొక్కారు. ఇళ్ల స్థలాలకు మెట్ట భూమి ధర ఇస్తుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థలాలకు సైతం అతి తక్కువ ధరకు కోట్ చేస్తుండటంతో తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. విషయం ఏమిటంటే నెల్లూరు - ముంబాయి రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. విస్తరణలో భాగంగా సంగంలో 12.26 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించారు. ఆ భూములకు ధరలు నిర్ణయించే ప్రక్రియ ప్రారంభం నుంచి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంగం మండలంలో ఎకరా భూమిని రూ.4 లక్షలుగా అధికారులు నిర్ణయించారు. అయితే రూ.20, రూ.30 లక్షలకు కూడా సంగం జాతీయ రహదారి పక్కన భూములు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వాస్తవాలను పక్కనపెట్టిన అధికారులు ఎకరానికి రూ.4 లక్షల ఇస్తామనడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇళ్ల స్థలాలకూ మెట్ట భూమిధరే మరో విచిత్రమేమిటంటే సంగం గ్రామంలో కొన్ని ఇళ్లు జాతీయ రహదారి విస్తరణలో పోతున్నాయి. వీటికి సైతం ఇంటి ధరలు నిర్ణయించకుండా మెట్ట భూములకు ఇచ్చినట్లే రూ.లక్షలు నిర్ణయించారు. దీంతో ఇళ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎంవీ రమణ అవార్డు ప్రకటించడంతో ఇంటి యజమానులు, రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ వార్డులో ఏ ఒక్కటీ నిజం లేదని, తమను సంప్రదించకుండానే అధికారులు నిర్ణయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఇవ్వడం లేదు నా ఇంటి స్థలానికి రిజిస్ట్రేషన్ నగదు కూడా ఇవ్వడం లేదు. మెట్టభూమిగా పరిగణించి ధర నిర్ణయించడం దారుణం.- సింగమల శ్రీనివాసులరెడ్డి కన్వర్షన్ కట్టినా మెట్టభూమిగా పరిగణించారు నేను వ్యవసా య భూమిని ప్రభుత్వ నిబంధనల మేరకు కన్వర్షన్ చెల్లించి ఇంటి స్థలంగా మార్చుకుని వాటర్ ప్లాంట్, వే బ్రిడ్జి, రూములు కట్టుకున్నా. కానీ ఇప్పుడు స్థలాలకు మెట్టభూమి ధర ఇస్తున్నట్లు అవార్డు తీర్మానించారు. - వెంకటేశ్వర్లురెడ్డి -
రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను అభివృద్ధి చేయాలి అసెంబ్లీలో ప్రస్తావించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు(అగ్రికల్చర్): చాలామంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి తక్షణం ఇళ్ల స్థలాలను కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా నెల్లూరు నగర శివారు ప్రాంతంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో కొత్తూరులో ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఈ ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి వసతులు కల్పించేందుకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంకా చాలా మంది విలేకరులు ఇళ్ల స్థలాలు లేక బాడుగ ఇళ్లలో నానా ఇబ్బందులు పడుతున్నారని, వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. -
గూడు.. గోడు...
ఒక్క రోజే 4 వేల దరఖాస్తులు పెండింగ్‌లో 1.92 లక్షల ఇళ్ల అర్జీలు సర్కారు మార్గదర్శకాలు లేక పరేషాన్ పాతికేళ్లలో నిర్మించినవి 40 వేల గృహాలే వైఎస్ హయాంలోనే సగం ఇళ్ల నిర్మాణం సిటీబ్యూరో:ఇళ్లు...స్థలాలు ఇస్తారనే ఆశతో వేలాది మంది కదిలారు. మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా హైదరాబాద్ కలెక్టరేట్‌కు క్యూ కట్టారు. దీంతో కలెక్టరేట్ సోమవారం పోటెత్తింది. స్థానికంగా ఉన్న మహిళా సంఘాల లీడర్లు, దళారులు, చోటా మోటా నాయకుల ప్రచారంతో వివిధ బస్తీల నుంచి మహిళలు, నిరుపేదలు ఆటోలు, ఇతర వాహనాలు అద్దెకు తీసుకొని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. దరఖాస్తులు ఇవ్వటానికి మహిళలు, పసిపిల్లలతో తల్లులు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కలెక్టరేట్లో సోమవారం ఒక్క రోజే ఇళ్ల కోసం 4 వేల మంది మహిళలు, నిరుపేద లు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ప్రజావాణిలో ఇళ్ల దరఖాస్తులు సమర్పించేందుకు రెండు, మూడు వారాలుగా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోమవారం ఈ సంఖ్య ఒకేసారి నాలుగు వేలకు చేరుకుంది. మార్గదర్శకాలు రాకుండానే... పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని, స్లమ్ ఫ్రీ సిటీగా చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన పేదల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇళ్లు, స్థలాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మంజూరై... పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణంపై ఇప్పటి వరక ు సర్కారు నిర్ణయం ప్రకటించలేదు. కొత్త ఇళ్లపైనా మార్గదర్శకాలు లేవు. అదే సమయంలో నిత్యం వందలాది మంది దరఖాస్తులు సమర్పిస్తుండడంతో సంబంధిత అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. వైఎస్ హయాంలోనే సగం ఇళ్లు హైదరాబాద్ నగరంలో గడచిన పాతికేళ్లలో వివిధ పథకాల కింద సుమారు 39,422 ఇళ్లు నిర్మించారు. ఇందులో సగానికి పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం లో నిర్మించనవేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రూ.వెయ్యి వంతున చెల్లించి... రాజీవ్ గృహకల్ప పథకం కింద 2005-06లో హైదరాబాద్ జిల్లా గృహ నిర్మాణ సంస్థ 50 వేల నిరుపేద కుటుంబాల నుంచి దరఖాస్తులతో పాటు రూ.1000 వంతున వసూలు చేసింది. ఈ ఇళ్ల కోసం ఏడాదికి పైగా ఎదురు చూసినా ఫలితం లేకపోవటంతో 15 వేల కుటుంబాలు తాము చెల్లించిన మొత్తాన్ని వాపసు తీసుకున్నాయి. మిగిలిన 35 వేల మంది లబ్థిదారులు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ హయాంలో రాజీవ్ గృహ కల్ప కింద 5,206 ఇళ్లు నిర్మించారు. ఆ తర్వాత ఇళ్ల ఊసే లేదు. జీ ప్లస్ 3కు నిరాదరణ నగరంలోని కొన్ని మురికివాడల్లో జీ ప్లస్ త్రీ పద్ధతిలో గృహాలు నిర్మిస్తామని, ఆ స్థలాలు ఖాళీ చేయాలని పేదలను కోరినా స్థానికులు ఒప్పుకోకపోవటంతో ఆ యోచనకుస్వస్తి చెప్పినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములు అనేకం కోర్టు కేసుల్లో ఉండటంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నట్లు వివరిస్తున్నారు. ఏళ్లుగా మారని తలరాతలు హైదరాబాద్ జిల్లాలో 25 ఏళ్ల కాలంలో 39,422 ఇళ్లు నిర్మించారు. ఈ లెక్కలను పరిశీలిస్తే వైఎస్ హయాంలో రూరల్ జిల్లాలోని ఒక మండలంలో నిర్మించిన ఇళ్లు కూడా నగరంలో నిర్మించి ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 1989-90 నుంచి 2004-05 వరకు ఈడబ్ల్యూఎస్ ద్వారా 16,018 ఇళ్లు, 2001-02 నుంచి 2005-06 వరకు వాంబేలో 12,048 ఇళ్లు నిర్మించారు. 2005-06 నుంచి 2013-14 వరకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 11,444 ఇళ్లు మంజూరు కాగా, 6,150 మాత్రమే నిర్మించారు. 2005-06 నుంచి 2014 వరకు రాజీవ్ గృహకల్పలో 5,206 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. భారీగా పెండింగ్ గతంలో రాజీవ్ గృహ కల్పలో ఇళ్ల కోసం దరఖాస్తుతో పాటు రూ.1000 వంతున చెల్లించిన వారు 35 వేల మంది ఉన్నారు. రచ్చ బండలో 1.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్ ప్రజావాణిలో ఏడు నెలల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 34 వేల మంది. మొత్తంగా సుమారు 1.92 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నా దరఖాస్తు తీసుకోలేదు ఇళ్లు మంజూరు చేస్తున్నారని, కలెక్టరేట్ కువెళ్లి దరఖాస్తు పెట్టుకోవాలని మా బస్తీలో చెబితే వచ్చాను. ఇక్కడ టైమ్ అయిపోయిందని దరఖాస్తు తీసుకోలేదు. మండలాఫీసుకు వెళ్లి ఇవ్వాలని చెప్పారు. చంటి పిల్లతో అతి కష్టమ్మీద వచ్చినా లాభం లేకుండాపోయింది. నాకు ఇల్లు వస్తాదో, రాదోనని ఆందోళనగా ఉంది. -లలిత, కిషన్‌బాగ్ ఉండడానికి సరిపోతే చాలు... ఇళ్లు వస్తున్నాయని చెబితేమా వాడలోని మహిళలందరం కలసి ఆటోలో కలెక్టరేట్‌కు వచ్చాం. గంటకుపైగా లైన్లో నిలబడి దరఖాస్తులు ఇచ్చాం. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తానని చెప్పింది. మాకు ఉండటానికి సరిపోయే ఇళ్లు ఇస్తే చాలు. -షమీమ్, ఫాతిమా బేగం, కిషన్‌బాగ్ తొందర పడొద్దు ఇళ్ల కేటాయింపులకు ప్రభుత్వం నుంచి నియమ నిబంధనలు రావాల్సింది. దరఖాస్తుదారులు దళారులను నమ్మి మోసపోవద్దు. కొంత మంది దళారులకు డబ్బులు ఇస్త్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం ఇళ్ల కోసం మార్గదర్శకాలు ప్రకటించగానే ప్రాధాన్య క్రమంలో మంజూరు చేస్తాం. - సంజీవయ్య, ఇన్చార్జి జేసీ