ఆకు పచ్చ బతుకు పచ్చ | Emerald green survival | Sakshi
Sakshi News home page

ఆకు పచ్చ బతుకు పచ్చ

Published Mon, Nov 2 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

ఆకు పచ్చ బతుకు పచ్చ

ఆకు పచ్చ బతుకు పచ్చ

అరటి ఆకులో భోజనం... ఆరోగ్యానికి తొలిమెట్టు.మరి భోజనం ముగిశాక తమలపాకుల సేవనం?... అదీ ఆరోగ్యానికి మరో మెట్టే...
 ఆకుపచ్చలోనే ఆరోగ్యం ఉంది. ఆకు కూరలో అది మరీ దాగి ఉంది. ప్రకృతి మనిషి కోసం ఎన్ని ఆకుకూరలను ప్రసాదించలేదు కనుక.... బచ్చలికూర... పాలకూర... చుక్కకూర... తోటకూర.... మెంతికూర... వంటివి మరోవైపు... ఒంటికే కాదు... కంటికి కూడా ఆరోగ్యమే...చల్లగాలిలో... తెల్లని వెన్నెలలో... ఆకుపచ్చటి వంటలు చేసుకుని... కడుపు నిండా తిని... నోరారా త్రేన్చి... పచ్చనాకు సాక్షిగా... అయినవారికి ఆకుల్లోనే పెట్టాలి అనుకుందాం....
 
తోటకూర ఉండలు
కావలసినవి: తోటకూర తరుగు - 3 కప్పులు, సెనగ పిండి - అర కప్పు, పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నీళ్లు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పచ్చి కొబ్బరి తురుము - టేబుల్ స్పూను పోపు కోసం: నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఎండు మిర్చి ముక్కలు - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, నూనె - 2 టీ స్పూన్లు. తయారీ:  ఒక పాత్రలో సన్నగా తరిగిన తోటకూర, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్ర, సెనగ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి  కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ గట్టిగా పకోడీల పిండిలా కలపాలి  చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి  బాణలిలో నూనె పోసి కాగాక, మంట తగ్గించి, తోటకూర ఉండలను ఒక్కొక్కటిగా వేస్తూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ నాప్‌కిన్ మీదకు తీసుకోవాలి  బాణలిలో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి  నువ్వులు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి   వేయించి ఉంచుకున్న తోటకూర ఉండలు జత చేసి, బాగా కలిపి దింపేయాలి  పచ్చి కొబ్బరి తురుము పైన చల్లి, టీతో అందించాలి.
 
మెంతికూర/కొత్తిమీర పచ్చడి

కావలసినవి: మెంతికూర - 10 కట్టలు, చింతపండు - నిమ్మకాయంత, నూనె - 4 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి - 15, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - కొద్దిగా, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - అర టీ స్పూను.
 తయారీ:  ముందుగా మెంతికూరను శుభ్రంగా కడిగి త డి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి  బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మెంతి కూర వేసి వేయించాలి  చింతపండు, ఉప్పు జత చేసి బాగా కలిపి ఆరేడు నిమిషాలు మగ్గించాలి  అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మెంతులు వేసి వేయించి దింపేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి  మెంతి కూర జత చేసి, మరోమారు మిక్సీ తిప్పాలి  బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ వేసి, ఒక్క పొంగు రానిచ్చి దింపేసి, మెంతికూర పచ్చడిలో వేయాలి  ఇది సుమారు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది  (ఇలాగే కొత్తిమీర పచ్చడి కూడా చేసుకోవచ్చు)
 
పొన్నగంటి ఆకు వేపుడు

వలసినవి: పొన్నగంటి ఆకు - 2 కప్పులు, పచ్చిసెనగ పప్పు - అర కప్పు, కొబ్బరి కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, పోపు కోసం, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, సెనగ పప్పు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను
 
తయారీ:  పచ్చి సెనగపప్పును శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాలి  బాణలిలో నూనె వేసి వేడయ్యాక, పోపు సామాను వేసి వేయించాలి  నానబెట్టిన సెనగపప్పు జత చేసి, బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి, మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించాక దీనికి పొన్నగంటి ఆకును జత చేసి బాగా కలపాలి   ఉప్పు, పసుపు వేసి మరోమారు కలిపి మూత ఉంచాలి  పొన్నగంటి ఆకు, సెనగ పప్పు బాగా కలిసి ఉడికిన తరవాత, కొబ్బరి కారం వేసి కలిపి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి, దింపేయాలి  వేడి వేడి చపాతీలలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది.
 
బచ్చలికూర మజ్జిగ పులుసు

కావలసినవి: బచ్చలి కూర - 3 కట్టలు (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి), చిక్కటి మజ్జిగ - 3 కప్పులు (కొద్దిగా పుల్లగా ఉండాలి), ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ధనియాల పొడి - టీ స్పూను, పచ్చి మిర్చి - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట
 తయారీ:  ఒక పాత్రలో బచ్చలి కూర, ఉప్పు వేసి ఉడికించి పక్కన ఉంచాలి  చిక్కగా చిలకరించిన పెరుగులో పసుపు వేసి బాగా కలిపాక, ఉడికించిన బచ్చలికూర వేయాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పెరుగు పచ్చడిలో వేసి కలపాలి  కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి కలిపి, వేడి వేడి అన్నంలో వడ్డించాలి.
 
పాలకూర సూప్
కావలసినవి: పాలకూర - 3 కట్టలు (సన్నగా తరగాలి), దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 3, బిర్యానీ ఆకు - 1, కరివేపాకు - 2 రెమ్మలు, ఉల్లి తరుగు - అర కప్పు (సన్నగా తరగాలి), వెల్లుల్లి తరుగు - టీ స్పూను, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చి మిర్చి - 1, బటర్ - టేబుల్ స్పూను, బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు (2టేబుల్ స్పూన్ల నీళ్లలో కలపాలి), మీగడ లేదా తాజా క్రీమ్ - ఒకటిన్నర టీ స్పూన్లు, మిరియాల పొడి - కొద్దిగా
 
తయారీ:  ఒక పాత్రలో బటర్ వేసి కరిగించాక, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి వేయించాలి  ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తురుము జత చేసి సుమారు 4 నిమిషాల సేపు వేయించాలి  పాలకూర తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరో రెండు నిమిషాలు కలపాలి  నాలుగు కప్పుల నీళ్లు జత చేసి బాగా కలిపి మంట ఆర్పేయాలి.  బాగా చల్లారిన తర్వాత వడకట్టాలి  లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కలను తీసేయాలి  పాలకూర ముద్ద, ఉల్లి తరుగు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి  వడ కట్టిన నీటిని పాలకూర ముద్దకు జత చేసి, సన్నటి మంట మీద సుమారు ఆరేడు నిమిషాలు ఉంచాలి  ఉప్పు, మిరియాల పొడి జత చేయాలి  నీళ్లలో కలిపి ఉంచిన బియ్యప్పిండిని జత చేసి బాగా క లుపుతుండాలి  తాజా క్రీమ్ జత చేసి దింపేయాలి  వేడివేడిగా అందించాలి.
 
 చుక్కకూర చట్నీ
 కావలసినవి: చుక్కకూర - 5 కట్టలు, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 3 టీ స్పూన్లు, నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఎండు మిర్చి - 5, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, ఎండు మిర్చి - 4 (ముక్కలు చేయాలి), ఆవాలు - టీ స్పూను

తయారీ:  ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండు మిర్చి, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి  చుక్కకూరను కడిగి సన్నగా తరగాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి  చుక్క కూర, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.  సుమారు పది నిమిషాలయ్యేసరికి చుక్క కూర గుజ్జులా అవుతుంది  నువ్వుల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి  బాగా చల్లారాక, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చడి బాగా కలిపి, వేడి వేడి అన్నంతో తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement