Betel
-
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు. -
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
తమలపాకు లేకుండా శుభాకార్యాలను అసలు ఊహించలేం కదా. అలాగే విందుభోజనం తరువాత తాంబూలం సేవించడం కూడా చాలామందికి అలవాటు. విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్ , రైబోఫ్లావిన్ వంటి పోషకాలు తమలపాకులలో లభిస్తాయి. అలాగే జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. కానీ తమలపాకుతో జుట్టు సమస్యలకు చెక్ చెప్పవచ్చని మీకు తెలుసా? సహజంగా దొరికే తమలపాకుద్వారా జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు. తలలో దురద, తెల్లజుట్టు సమస్య కూడా నయమ వుతుంది. తమలపాకుల్లో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు జుట్టు చిట్లడం మరియు రాలడాన్ని నివారిస్తాయి. కాబట్టి జుట్టు రాలకుండా ఉండేందుకు తమలపాకులను ఉపయోగించే మార్గాన్ని తెలుసుకుందాం.తమలపాకు నీటితో జుట్టును కడగాలితల కడుక్కోవడానికి 15-20 తమలపాకులను ఒక పాత్రలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత దీంతో జుట్టులో వాచ్ చేయాలి. తమలపాకులో యాంటీమైక్రోబయల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేస్తుంది. తమలపాకు,నెయ్యి హెయిర్ మాస్క్తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టు చేయాలి. ఇందులో టీస్పూను నెయ్యి వేసి కలిపి, మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. మసాజ్తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారంలో ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.తమలపాకులతో చేసిన నూనెజుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తమలపాకుతో చేసిన నూనె కంటే గొప్పది ఏదీ ఉండదు. కొబ్బరి లేదా ఆవనూనెలో 10 నుండి 15 తమలపాకులను వేసి సన్నని మంటపై మరిగించాలి. తమలపాకులు నల్లగా మారాగా, ఈ నూనెను వడపోసి, స్కాల్ప్ నుంచి జుట్టంతా బాగా పట్టించాలి. ఇది రాత్రంతా ఉంచుకోవచ్చు. తలస్నానానికి ఒక గంట ముందు రాసు కోవచ్చు. తమలపాకులను తినండిఉదయం ఖాళీ కడుపుతో 5-6 తమలపాకులను నమలవచ్చు లేదా 10-5 తమలపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. -
ఇలా చేస్తే తమలపాకు రైతులకు లాభాల పంటే...!
-
సూపర్ స్నాక్స్.. తమలపాకు గారెలు తయారీ ఇలా
తమలపాకు గారెలు తయారీకి కావల్సినవి: తమలపాకులు – 10 (కడిగి, కచ్చాబిచ్చాగా తరిగి, కొద్దిగా మిరియాల పొడి కలిపి పెట్టుకోవాలి) మినపగుళ్లు – 1 కప్పు (4 గంటలు నానబెట్టుకోవాలి) పచ్చి మిర్చి – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి, అభిరుచిని బట్టి) అల్లం – చిన్న ముక్క, కరివేపాకు – 1 రెబ్బ ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి, అభిరుచిని బట్టి) బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత బేకింగ్ సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ఇలా.. ముందుగా నానబెట్టిన మినపగుళ్లను మిక్సీలో వేసి.. అల్లం ముక్క, కరివేపాకు వేసుకుని గారెల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. అందులో బియ్యప్పిండి, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తమలపాకు మిశ్రమాన్ని జోడించి బాగా కలిపి.. గారెల్లా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.అంతే క్రిస్పీగా ఉండే తమలపాకు గారెలు రెడీ.. -
తమలపాకు పంటకు కరోనా దెబ్బ
పశ్చిమ గోదావరి,యలమంచిలి: తమలపాకు పంటకు కరోనా దెబ్బ తగిలింది. పశ్చిమ డెల్టాలో సుమారు 300 ఎకరాలలో తమలపాకు సాగవుతోంది. ప్రస్తుతం తోటలన్నీ కోతకు వచ్చి ఉన్నాయి. కరోనా వైరస్ వల్ల తమలపాకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇదే పరిస్థితి మరో 15 రోజులు కొనసాగితే రైతులకు రూ.లక్షల్లో నష్టం వస్తుంది. తమలపాకు ఎగుమతి వ్యాపారానికి దొడ్డిపట్ల గ్రామం ప్రసిద్ధి. ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరితీరం వెంబడి లంక గ్రామాలైన లక్ష్మీపాలెం, అబ్బిరాజుపాలెం, కనకాయలంక, పెదలంక, బూరుగుపల్లి, కంచుస్థంభంపాలెం, భీమలాపురం, కోడేరు, ఆనగార్లంక గ్రామాల్లో తమలపాకు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే తమలపాకులన్నీ దొడ్డిపట్ల కేంద్రంగానే లారీల్లోకి ఎగుమతి కాగా మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగపూర్, బుసావళి, కాంగం, యవత్‌మాల్‌తోపాటు హైదరాబాద్‌కు వెళ్తాయి. దొడ్డిపట్ల నుంచి రోజుకు వెయ్యి బుట్టలు(లారీకి 500 బుట్టలు) ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో బుట్ట తమలపాకులకు రూ.600 నుంచి రూ.700 వరకు ధర ఉంది. అంటే దొడ్డిపట్ల కేంద్రంగా రోజుకి రూ.12 లక్షలు నుంచి రూ.14 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. మార్చి 15 నుంచి జూలై 15 వరకు సీజన్ ఉంటుంది. అంటే ఈ నాలుగు నెలల కాలంలో నెలకు సుమారు రూ.4 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. అంటే సీజన్ మొత్తానికి రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని తమలపాకుల ఎగుమతిదారుడు ఓదూరి భాస్కరరావు చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో రవాణా మొత్తం బంద్ కావడంతో చేతికి వచ్చిన పంట ఎక్కడ నష్టపోతామోననే భయం రైతులను వెంటాడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కాయకూరలు ఎగుమతికి అవకాశం ఇచ్చిన విధంగానే తమలపాకు పంట ఎగుమతులకు అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
నగరంలోని పాన్‌మండీకి వందేళ్ల చరిత్ర..
దేశంలోనే అత్యధికంగా తమలపాకుల వినియోగం. నిత్యం 25 లక్షల పాన్ల తయారీకి ఈ ప్రాంతం నుంచే నగరంలోని పలు షాపులకు సరఫరా. ప్రత్యక్షంగా, పరోక్షంగా తమలపాకుల ద్వారా సుమారు 25 వేల కుటుంబాలకు జీవనోపాధి.నగరంలో వందేళ్లకుపైగా చరిత్ర. తమలపాకులకూ ఓ ప్రత్యేక మార్కెట్. ఇలా ఎన్నో విశేషాలతోకూడుకున్నది నగరంలోని పాన్‌మండీ. దీని గురించి తెలుసుకోవాలనుందా?.. అయితే ఈ కథనం చదవాల్సిందే మరి. నిజాంల హయాం నుంచే.. నగరంలో నిజాం నవాబుల కాలం నుంచే తమలపాకుల వినియోగం ఉంది. ఆ రోజుల్లో పాన్‌షాప్‌లు నగరంలో అందుబాటులో ఉండేవి కావు. నవాబులు, ఉన్నత వర్గాలు, ధనికుల ఇళ్లలో పాన్దాన్ ఉండేవి. పాన్దాన్ అంటే తమలపాకులతో పాటు వక్కలు, సోంపు, సున్నం, కాసుతో పాటు ఇలాచీ, లవంగం ఉండే చిన్నపాటి పెట్టె అన్నమాట. ఏదైనా విందు జరిగిన సందర్భాలతో పాటు ఇంటికి వచ్చిన చుట్టాలకు అన్నపానీయాల అనంతరం నమలడానికి తమలపాకులు తప్పకుండా ఇచ్చేవారు. ఇలా నగరంలో అనాదిగా తమలపాకులు వినియోగం ఉండేది. అప్పట్లో మొజాంజాహి మార్కెట్లో.. నిజాంల కాలంలోనే పాన్ విక్రయాల కోసం పాన్‌మండీని ఏర్పాటు చేశారు. 1919లో మొజాంజాహి మార్కెట్లో పాన్ విక్రయాలకు అనుమతించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. మొజాంజాహి మార్కెట్ 1935లో నిర్మించారు. కానీ అదే ప్రాంతంలో పాన్‌మండీ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. ఆ రోజుల్లో నల్లగొండ, రంగారెడ్డి ప్రాంతాల పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై వివిధ రకాల నిత్యావసర వస్తువులు ఇక్కడికి వచ్చేవి. ఆ ప్రాంతమంతా మైదానంగా ఉండేది. ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా సమీపంలోనే ఉండడంతో పాన్‌మండీ ఇక్కడే ఏర్పాటైందని సమాచారం. పాన్‌మండీ 1962 వరకు ఇక్కడే కొనసాగిందని.. అనంతరం దీనిని దారుస్సలాంనకు మార్చినట్లు పాన్‌మండీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇవీ ప్రత్యేకతలు.. పాన్‌మండీలో తమలపాకులు పెద్ద పెద్ద బుట్టల్లో దిగుమతి అవుతాయి. కడప జిల్లా నుంచి అత్యధికంగా తమలపాకులు వస్తుంటాయి. మహారాష్ట్ర నుంచి సైతం కొంత మొత్తంలో మార్కెట్‌కు దిగుమతి అవుతాయి. పాన్ షాపుల యజమానులు, కేటరింగ్ చేసే వారితో పాటు పాన్ విక్రయించే వారు ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో బుట్టలో 2 వేల నుంచి 2,500 తమలపాకులుంటాయి. ఒక్కో బుట్టలో తమలపాకుల నాణ్యతను బట్టి రూ.450 నుంచి రూ.650 వరకు ధర ఉంటుంది. ప్రస్తుతం ఎండల ప్రభావంతో బుట్ట ఒకటి రూ.800 నుంచి రూ.1150 వరకు పలుకుతోంది. వారానికి మూడు రోజులే.. దారుస్సలాం పాన్ మార్కెట్లో వారానికి మూడురోజులు మాత్రమే తమలపాకుల వ్యాపారం కొనసాగుతోంది. సోమ, బుధ, శుక్రవారాల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. నగరంలోని పాన్ షాప్‌లకే కాకుండా ఇతర జిల్లాలకు కూడా తమలపాకులు సరఫరా చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో నగర శివారుతో పాటు నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి తమలపాకులు నగర మార్కెట్‌కు దిగుమతయ్యేవి. ప్రస్తుతం కేవలం కడప జిల్లాతో పాటు పాలకొల్లు నుంచి దిగుమతి అవుతున్నాయని వారు పేర్కొన్నారు. వ్యాపారం కొంత తగ్గింది.. గతంలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే తమలపాకులు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అన్ని జిల్లాలో పాన్‌మండీలు ఏర్పాటయ్యాయి. నేరుగా తమలపాకులను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారం కొంతమేర తగ్గింది. – ఖాదర్ మొహియొద్దీన్ రాష్ట్రంలోనే హోల్‌సేల్ మార్కెట్.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హోల్‌సేల్ మార్కెట్. అన్ని జిల్లాలకు ఇక్కడి నుంచే తమలపాకులు సరఫరా అవుతాయి. పాన్‌షాప్‌లు, తమలపాకుల ద్వారా నగరంలో 25 వేల మంది ఉపాధి పొందుతున్నారు. నిత్యం నగరంలో 25 లక్షల తమలపాకుల వినియోగమవుతున్నట్లు అంచనా. -
ఆకుపచ్చ కన్నీరు
-
తమలపాకు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి
-
మేలు ఆకు తమలపాకు
హెల్త్ టిప్స్ తమలపాకుల్లో ఆరోగ్యాన్నిచ్చే సుగుణాలున్నాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి తమలపాకులు చాలా ఉపయోగపడతాయి. వయసు పెరిగే కొద్దీ అరుగుదల క్షీణిస్తుందని బెంగ అక్కర్లేదు... రెండు తమలపాకులు నమలండి వాటిపని అవి చేసుకుంటూ పోతాయి. ఇంకా తమలపాకు వల్ల ఉపయోగాలేంటో చూడండి. తమలపాకులని ఆవనూనెలో నానపెట్టి కొద్దిగా వేడిచేసి పిల్లల చాతీపై రుద్దితే ఆయాసం, దగ్గులాంటివి తగ్గుతాయి. ∙తమలపాకులను నూరి తీసిన రసాన్ని గాయాలపై రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. ∙శుద్ధిచేసిన కొబ్బరినూనెలో తమలపాకుల నుంచి తీసిన రసాన్ని కలిపి వీపు వెనుక భాగంలో రాసినట్టయితే వెన్నునొప్పి తగ్గుతుంది. తమలపాకు రసం గొంతు భాగంలో రుద్దితే గొంతులో నస, గొంతు మంట, గొంతు ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ∙కొన్ని చుక్కల తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది. ∙భుక్తాయాసంగా ఉన్నప్పుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరిగి ఉపశమనం లభిస్తుంది. ∙మెత్తబడే వరకు తమలపాకుని వేడిచేసి దానిపై ఆముదం పూసి కాలిన గాయాలపై ఉంచితే, గాయం త్వరగా మానుతుంది. ఇలా గంటగంటకూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ∙ఆర్థరైటిస్ వల్ల కీళ్లభాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే ఆ భాగంలో మంట, ఉపశమనం లభిస్తుంది. -
ఆకు పచ్చ బతుకు పచ్చ
అరటి ఆకులో భోజనం... ఆరోగ్యానికి తొలిమెట్టు.మరి భోజనం ముగిశాక తమలపాకుల సేవనం?... అదీ ఆరోగ్యానికి మరో మెట్టే... ఆకుపచ్చలోనే ఆరోగ్యం ఉంది. ఆకు కూరలో అది మరీ దాగి ఉంది. ప్రకృతి మనిషి కోసం ఎన్ని ఆకుకూరలను ప్రసాదించలేదు కనుక.... బచ్చలికూర... పాలకూర... చుక్కకూర... తోటకూర.... మెంతికూర... వంటివి మరోవైపు... ఒంటికే కాదు... కంటికి కూడా ఆరోగ్యమే...చల్లగాలిలో... తెల్లని వెన్నెలలో... ఆకుపచ్చటి వంటలు చేసుకుని... కడుపు నిండా తిని... నోరారా త్రేన్చి... పచ్చనాకు సాక్షిగా... అయినవారికి ఆకుల్లోనే పెట్టాలి అనుకుందాం.... తోటకూర ఉండలు కావలసినవి: తోటకూర తరుగు - 3 కప్పులు, సెనగ పిండి - అర కప్పు, పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నీళ్లు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పచ్చి కొబ్బరి తురుము - టేబుల్ స్పూను పోపు కోసం: నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఎండు మిర్చి ముక్కలు - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, నూనె - 2 టీ స్పూన్లు. తయారీ: ఒక పాత్రలో సన్నగా తరిగిన తోటకూర, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్ర, సెనగ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ గట్టిగా పకోడీల పిండిలా కలపాలి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక, మంట తగ్గించి, తోటకూర ఉండలను ఒక్కొక్కటిగా వేస్తూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి బాణలిలో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి నువ్వులు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి వేయించి ఉంచుకున్న తోటకూర ఉండలు జత చేసి, బాగా కలిపి దింపేయాలి పచ్చి కొబ్బరి తురుము పైన చల్లి, టీతో అందించాలి. మెంతికూర/కొత్తిమీర పచ్చడి కావలసినవి: మెంతికూర - 10 కట్టలు, చింతపండు - నిమ్మకాయంత, నూనె - 4 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి - 15, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - కొద్దిగా, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - అర టీ స్పూను. తయారీ: ముందుగా మెంతికూరను శుభ్రంగా కడిగి త డి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మెంతి కూర వేసి వేయించాలి చింతపండు, ఉప్పు జత చేసి బాగా కలిపి ఆరేడు నిమిషాలు మగ్గించాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మెంతులు వేసి వేయించి దింపేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మెంతి కూర జత చేసి, మరోమారు మిక్సీ తిప్పాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ వేసి, ఒక్క పొంగు రానిచ్చి దింపేసి, మెంతికూర పచ్చడిలో వేయాలి ఇది సుమారు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది (ఇలాగే కొత్తిమీర పచ్చడి కూడా చేసుకోవచ్చు) పొన్నగంటి ఆకు వేపుడు వలసినవి: పొన్నగంటి ఆకు - 2 కప్పులు, పచ్చిసెనగ పప్పు - అర కప్పు, కొబ్బరి కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, పోపు కోసం, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, సెనగ పప్పు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను తయారీ: పచ్చి సెనగపప్పును శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాలి బాణలిలో నూనె వేసి వేడయ్యాక, పోపు సామాను వేసి వేయించాలి నానబెట్టిన సెనగపప్పు జత చేసి, బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి, మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించాక దీనికి పొన్నగంటి ఆకును జత చేసి బాగా కలపాలి ఉప్పు, పసుపు వేసి మరోమారు కలిపి మూత ఉంచాలి పొన్నగంటి ఆకు, సెనగ పప్పు బాగా కలిసి ఉడికిన తరవాత, కొబ్బరి కారం వేసి కలిపి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి, దింపేయాలి వేడి వేడి చపాతీలలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. బచ్చలికూర మజ్జిగ పులుసు కావలసినవి: బచ్చలి కూర - 3 కట్టలు (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి), చిక్కటి మజ్జిగ - 3 కప్పులు (కొద్దిగా పుల్లగా ఉండాలి), ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ధనియాల పొడి - టీ స్పూను, పచ్చి మిర్చి - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారీ: ఒక పాత్రలో బచ్చలి కూర, ఉప్పు వేసి ఉడికించి పక్కన ఉంచాలి చిక్కగా చిలకరించిన పెరుగులో పసుపు వేసి బాగా కలిపాక, ఉడికించిన బచ్చలికూర వేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పెరుగు పచ్చడిలో వేసి కలపాలి కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి కలిపి, వేడి వేడి అన్నంలో వడ్డించాలి. పాలకూర సూప్ కావలసినవి: పాలకూర - 3 కట్టలు (సన్నగా తరగాలి), దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 3, బిర్యానీ ఆకు - 1, కరివేపాకు - 2 రెమ్మలు, ఉల్లి తరుగు - అర కప్పు (సన్నగా తరగాలి), వెల్లుల్లి తరుగు - టీ స్పూను, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చి మిర్చి - 1, బటర్ - టేబుల్ స్పూను, బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు (2టేబుల్ స్పూన్ల నీళ్లలో కలపాలి), మీగడ లేదా తాజా క్రీమ్ - ఒకటిన్నర టీ స్పూన్లు, మిరియాల పొడి - కొద్దిగా తయారీ: ఒక పాత్రలో బటర్ వేసి కరిగించాక, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి వేయించాలి ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తురుము జత చేసి సుమారు 4 నిమిషాల సేపు వేయించాలి పాలకూర తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరో రెండు నిమిషాలు కలపాలి నాలుగు కప్పుల నీళ్లు జత చేసి బాగా కలిపి మంట ఆర్పేయాలి. బాగా చల్లారిన తర్వాత వడకట్టాలి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కలను తీసేయాలి పాలకూర ముద్ద, ఉల్లి తరుగు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి వడ కట్టిన నీటిని పాలకూర ముద్దకు జత చేసి, సన్నటి మంట మీద సుమారు ఆరేడు నిమిషాలు ఉంచాలి ఉప్పు, మిరియాల పొడి జత చేయాలి నీళ్లలో కలిపి ఉంచిన బియ్యప్పిండిని జత చేసి బాగా క లుపుతుండాలి తాజా క్రీమ్ జత చేసి దింపేయాలి వేడివేడిగా అందించాలి. చుక్కకూర చట్నీ కావలసినవి: చుక్కకూర - 5 కట్టలు, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 3 టీ స్పూన్లు, నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఎండు మిర్చి - 5, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, ఎండు మిర్చి - 4 (ముక్కలు చేయాలి), ఆవాలు - టీ స్పూను తయారీ: ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండు మిర్చి, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి చుక్కకూరను కడిగి సన్నగా తరగాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి చుక్క కూర, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. సుమారు పది నిమిషాలయ్యేసరికి చుక్క కూర గుజ్జులా అవుతుంది నువ్వుల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి బాగా చల్లారాక, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చడి బాగా కలిపి, వేడి వేడి అన్నంతో తీసుకోవాలి.