
రానాతో లంచ్ చేస్తారా.. సెల్ఫీ కూడా కావాలా?
రానాతో కలిసి లంచ్ చేయాలనుకుంటున్నారా.. అలాగే ఓ సెల్ఫీ కూడా దిగాలనుకుంటున్నారా? అయితే జస్ట్ ఓ 200 రూపాయలు, లేదా అంతకంటే ఎక్కువ డొనేట్ చేస్తే చాలు!! దాంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ మాట స్వయంగా రానానే చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉందా.. భల్లాలదేవతో లంచ్ అంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండటం సహజం.
అసలు విషయానికొస్తే.. రానా దగ్గుపాటి VynVyn.com అనే వెబ్సైట్తో కలిసి ఓ మంచి పనికి పూనుకున్నారు. ఆర్థిక పరిస్థతుల వల్ల చాలామంది చిన్నారులు సరైన పోషణకు దూరమౌతున్నారని.. మనందరం కలిసి ఆరోగ్యంగా ఉండాల్సిన వారి హక్కును వారికిద్దామని అంటున్నారు. అయితే దీనికి మనం చేయాల్సిందల్లా.. రెండు వందల రూపాయలు మొదలుకుని మనకు తోచినంత సాయం చేయడమే. అలా మనం చేసే సాయం నేరుగా వారికి చేరేలా ఏర్పాటు చేశారు.
చిన్నారులకు సాయం చేసినవారిలో ఒకరిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి రానాతో లంచ్ చేసే అవకాశం కల్పిస్తారు. అంతేనా.. ఇండియాలోని ఏ ప్రాంతంలోనైనా లంచ్కి రెడీ అంటున్నారు రానా. మన కబుర్లన్నీ వింటారట, మనతో సెల్ఫీలకు కూడా రెడీ అట. 'ఇదంతా డబుల్ ఓకే.. కానీ ఆ లక్కీ విన్నర్ మేం కాకపోతే?..' అనేదేగా మీ డౌట్. ఆ విషయం కూడా చెప్పారు రానా.. డొనేట్ చేసిన అందరికీ తప్పక బహుమతులుంటాయట. బంపర్ ఆఫర్.. ఫ్యాన్స్.. ఇంకెందుకు, ముందుకు దూకండి!