హైదరాబాద్: అక్కినేని నటవారసుడు, యువ హీరో అఖిల్ ఓ అసక్తికరమైన ట్వీట్ చేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో కింగ్ నాగార్జున నిర్మిస్తున్న చిత్రం సెట్ లో అమ్మతో కలిసి భోంచేసిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. బ్యూటీఫుల్ లేడీతో లంచ్ చేశా.. ఆమెనవ్వు చాలా ఇష్టం. థాంక్యూ మై డీయర్ అమ్మా అంటూ అఖిల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు, సీనియర్ నటి , తన తల్లి అమలతో సెల్ఫీని కూడా అభిమానులతో పంచుకున్నారు.
కాగా అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై 'కింగ్' నాగార్జున ఓ కమర్షియల్ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు ఏప్రిల్ 2 న ప్రారంభం అయింది. 'మనం' టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందనీ ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.
Had Lunch with this beautiful lady on sets today. Her smile is what I love most.