
సోషల్ మీడియాలో పలు ఆసక్తికర సంఘటనలు వైరల్‌గా మారుతుంటాయి. ఆ క్రమంలోనే ఒకరి ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ‘భోజనానికి వెళ్తున్నా’, ‘భోజనం చేసి వచ్చా’ అని చేసిన పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే అతడు భోజనానికి వెళ్తున్నా అని పోస్టు చేసిన 14 ఏళ్ల తర్వాత ‘భోజనం చేసి వచ్చా’ అని ట్వీట్ చేశాడు. అంటే పదాల్నుగేళ్ల పాటు భోజనం చేశాడు అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ ట్వీట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
@deleted అనే ట్విటర్ ఖాతాదారుడు 2007 మార్చి 15వ తేదీన మొదట ‘భోజనం కోసం వేచి చూస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. ఆ కొద్దిసేపటికి ‘భోజనం కోసం బయటకు వెళ్తున్నా (Going Out For Lunch)’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన అనంతరం అతడి ఖాతా నుంచి కొన్నేళ్లుగా ఒక్క పోస్టు కూడా చేయలేదు. అయితే తాజాగా జూలై 25, 2021న అంటే 14 సంవత్సరాల అనంతరం ‘భోజనం నుంచి తిరిగొచ్చా’ అని ట్వీట్ చేశాడు. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన అతడి ట్వీట్ చూసిన ఫాలోవర్లు ఆశ్చర్యంగా చూసి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఏం నాయనా పద్నాలుగేళ్ల పాటు భోజనానికి వెళ్లావా అని ప్రశ్నించారు. వనవాసం పద్నాలుగేళ్లు ఉంటుంది... నువ్వు భోజనం కోసం అన్ని సంవత్సరాలు వెళ్లావా? అని కామెంట్లు చేశారు. నువ్వు భోజనం చేసేచ్చేలోపు సమాజంలో ఎన్నో మార్పులు జరిగాయి అని ఓ నెటిజన్ రిప్లయ్ ఇచ్చాడు. ఆ రెస్టారెంట్ ఏదో చెప్పవా? అంటూ స్కాండినవియాన్ అడిగాడు. అయితే ఆయన 14 ఏళ్ల పాటు భోజనం వెళ్లాడా? అన్ని సంవత్సరాలు ఏం చేశాడు? ఎందుకు ట్వీట్లు చేయలేదు? అనే సందేహాలు నెటిజన్లలో మొదలైంది. వాటిని అతడిని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు.
Tell me the restaurant you have been too I shall never go there pic.twitter.com/pGq4tX6FwV
— ll SᴄᴀɴᴅɪɴᴀᴠɪᴀN llᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ 💞 (@Odinsonleftus) July 26, 2021