కడప: మధ్యాహ్న భోజనం వికటించి 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కడప జిల్లాలోని పులివెందుల రమణప్ప సత్రం స్కూల్లో గురువారం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు వాంతులు, విరేచనాలు, వికారం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.