
దుబాయ్: బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్ ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్యతో బాధపడ్డారు. కాగా లాక్‌డౌన్ సమయంలో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్, ఆయన పిల్లలు దుబాయ్‌లోనే ఉండిపోయారు. అయితే సంజయ్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తెలిసి మాన్యతా దత్ ముంబైకి వచ్చారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో సంజయ్ దత్, ఆయన భార్య తమ పిల్లలను చూడడానికి దుబాయ్ వెళ్లారు. కాగా సంజయ్ దత్ కుటుంబం దుబాయ్‌లో లంచ్ చేస్తున్న ఫోటోను మాన్యతా దత్ సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది.
సంజయ్ దత్ తన భార్య పిల్లలతో కలిసి ఉత్సాహంగా లంచ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలయింది. ప్రస్తుతం సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సంజయ్ సినిమా షూటింగ్‌కు కొంత విరామం ప్రకటించారు. 2020లో కేజీఎఫ్ సినిమా విడుదలవనుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. (చదవండి: క్యాన్సర్ శాపం)
Comments
Please login to add a commentAdd a comment