
సూపర్‌స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. కుటుంబం సహా పలు విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌తో ఓ ఫోటోను నమ్రత షేర్ చేసింది. అనుకోని లంచ్ డేట్ ఇది. చాలా సంవత్సరాల తర్వాత ఇలా కలిశాం.
ఎన్నోఫ్లాష్‌బ్యాక్‌లు, గొప్ప జ్ఞాపకాలు, చాలా నవ్వులు మిగిల్చాయి అంటూ నమ్రత పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో తళుక్కుమన్నారు. కాగా మహేశ్, షారుక్ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. గతంలో 'బ్రహ్మోత్సవం' సెట్స్‌లో కూడా మహేష్ దంపతులను షారుక్ కలిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment