కాకా హోటల్లో హరీశ్ రావు | Minister harishrao ate lunch in kaka hotel | Sakshi
Sakshi News home page

కాకా హోటల్లో హరీశ్ రావు

Published Wed, Feb 10 2016 5:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

కాకా హోటల్లో హరీశ్ రావు

కాకా హోటల్లో హరీశ్ రావు

నారాయణ్ఖేడ్: ఆయనో మంత్రి. కోరుకుంటే ఫైవ్‌ స్టార్‌ హోటల్లో, ఖరీదైన భోజనం చేయగలరు. ఎక్కడి నుంచి అయినా కావాల్సిన వంటకాలు తెప్పించుకుని తినగలరు...మరి అలాంటి వ్యక్తిని ఓ రోడ్డు సైడ్‌ హోటల్‌లో తింటూ ఊహించగలమా....అందులోనూ పులిహోర, కారా, పొంగల్‌ లాంటి మామూలు వంటలు. నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక ప్రచారంలో... సరిగ్గా ఇదే జరిగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకో....లేదంటే ప్రచారంలో తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేసిందో తెలియదు కానీ....తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఓ కాకా హోటల్‌లో సందడి చేశారు.

పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి.... సదా సీదా వంటలు భుజించి ఆకలి తీర్చుకున్నారు. అంతేకాదు...చుట్టుపక్కలున్న తన అనుచరులకు కూడా కొసరి కొసరి వడ్డించారు. ఓ రాష్ట్రమంత్రి ఓ సాదాసీదా హోటల్‌లో సామాన్యుడిల్లా తింటుండడంతో....దీన్ని చూసేందుకు స్థానికులు పోటీపడ్డారు. మంత్రి హరీష్‌రావే కాదు... డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్‌ రెడ్డి కూడా సహచరులతో కబుర్లు చెప్పుకుంటూ సామాన్యుడి వంటకాలను ఆరగించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement