
విద్యార్థితో కలెక్టర్ సుహాస్
తిరువనంతపురం : కేరళలోని అలెప్పీ జిల్లా కలెక్టర్ సుహాస్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. నీర్‌కుణ్ణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సందర్శించిన ఆయన తనిఖీలు నిర్వహించారు. స్వయంగా విద్యార్థులతో కలసి భోజనం చేసి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తెలుసుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు జిల్లా కలెక్టర్ అలప్పుజా పేజిలో పోస్టు చేశారు. కొద్ది గంటల్లోనే ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించి స్వయంగా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలసి భోజనం చేసిన కలెక్టర్ సుహాస్‌ను నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు.
పాఠశాలలో విద్యార్థులకు ఏ మేరకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు సర్‌ప్రైజ్ విజిట్ చేసినట్లు సుహాస్ ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment