సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) పరిధిలోని వసంత కుంజ్‌కు చెందిన బీజేపీ కౌన్సిలర్ మనోజ్ మెహ్లవత్ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడటంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. మనోజ్ మెహ్లవత్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేష్ గుప్తా ఆయన్ను సస్పెండ్ చేసిన విషయాన్ని శంకర్ కపూర్ వెల్లడించారు.
ఇది తమ పార్టీ పారదర్శకతకు నిదర్శమని ఆయన తెలిపారు. కాగా, ఇంటి నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతివ్వడానికి కౌన్సిలర్ మనోజ్ లంచం తీసుకున్నట్లు సీబీఐ విచారణలో తేలింది. దాంతో మనోజ్‌ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment