న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం ఇంట్లో జరిగిన దాడి, మున్సిపల్ కార్పొరేషన్‌కు దళిత మేయర్‌ను నియమించాలనే డిమాండ్లతో ఆందోళనకు దిగారు.
దీంతో సమావేశాలను మరుసటి రోజుకు మేయర్ వాయిదా వేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్పందించారు. ‘బీజేపీ కార్పొరేటర్లు సమావేశాలను జరగనివ్వలేదు. బీజేపీ కార్పొరేటర్లు సభలో గందరగోళం సృష్టించారు. సంవత్సరంన్నర నుంచి స్టాండింగ్ కమిటీ వేయకుండా అడ్డుకున్నది బీజేపీ కార్పొరేటర్లే’అని మేయర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment