ఈవీఎంలు వద్దు, బ్యాలెట్‌ పేపర్లే వాడాలి | EVMs can be manipulated, says himachal pradesh cm virabhadra singh | Sakshi
Sakshi News home page

ఈవీఎంలు వద్దు, బ్యాలెట్‌ పేపర్లే వాడాలి

Published Wed, Apr 5 2017 2:46 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

ఈవీఎంలు వద్దు, బ్యాలెట్‌ పేపర్లే వాడాలి - Sakshi

ఈవీఎంలు వద్దు, బ్యాలెట్‌ పేపర్లే వాడాలి

సిమ్లా: ఎన్నికల్లో ఈవీఎంల వాడటాన్ని నిషేధించాలంటూ హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వీరభద్ర సింగ్‌ డిమాండ్‌ చేశారు. హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటాన్ని నిషేధించి, బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై వీరభద్ర సింగ్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇటీవలి జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే బీజేపీ గెలిచిందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ కూడా బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే ఎన్నికలకు మొగ్గుచూపుతోంది.  బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement