virabhadra singh
-
వీరభద్ర సింగ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ : రూ ఏడు కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్తో పాటు ఆయన భార్య ప్రతిభా సింగ్ మరో ముగ్గురికి ప్రత్యేక న్యాయస్ధానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయడంతో న్యాయస్ధానం ఎదుట హాజరైన నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో యూనివర్సల్ యాపిల్ అసోసియేట్ అధినేత చున్ని లాల్ చౌహాన్, ఇతర నిందితులు ప్రేమ్‌రాజ్, లవన్ కుమార్లకూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులందరికీ రూ 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. నిందితులకు బెయిల్ ఇవ్వరాదని, వారిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని విచారణ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది నితీష్ రాణా కోరారు. ఈడీ వాదనను తోసిపుచ్చిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. -
ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే వాడాలి
సిమ్లా: ఎన్నికల్లో ఈవీఎంల వాడటాన్ని నిషేధించాలంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ డిమాండ్ చేశారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటాన్ని నిషేధించి, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై వీరభద్ర సింగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలి జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలకు మొగ్గుచూపుతోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.