వీరభద్ర సింగ్ (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ : రూ ఏడు కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్‌తో పాటు ఆయన భార్య ప్రతిభా సింగ్ మరో ముగ్గురికి ప్రత్యేక న్యాయస్ధానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయడంతో న్యాయస్ధానం ఎదుట హాజరైన నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదే కేసులో యూనివర్సల్ యాపిల్ అసోసియేట్ అధినేత చున్ని లాల్ చౌహాన్, ఇతర నిందితులు ప్రేమ్‌రాజ్, లవన్ కుమార్‌లకూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులందరికీ రూ 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. నిందితులకు బెయిల్ ఇవ్వరాదని, వారిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని విచారణ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది నితీష్ రాణా కోరారు. ఈడీ వాదనను తోసిపుచ్చిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment