చౌటుప్పల్/సంస్థాన్‌నారాయణపురం : మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌లో ఉమ్మడి నల్లగొండజిల్లాలో పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు తప్పుల తడకగా వచ్చాయి. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో 29వ పోలింగ్ బూత్‌లో అదే మండలం లోని నేలపట్ల గ్రామానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. ఈ క్రమంలో 13మంది ఓటర్లు ఇవే బ్యాలెట్ పేపర్లతో ఓట్లు వేశారు. తర్వాత తప్పును కొందరు ఓటర్లు గుర్తించి అధికారులకు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో అధికారు లు స్పందించి బ్యాలెట్ పేపర్లను ఆ గ్రామానికి పంపించారు. అనంతరం ఆ 13 మందిని తిరిగి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
అలాగే సంస్థాన్‌నారాయణపురం మండలం కంకణాలగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని శేరిగూడెంలో 12వ పోలింగ్ కేంద్రానికి జనగామ ఎంపీటీసీ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఇది గమనించని అధికారులు పోలింగ్ నిర్వహించారు. అప్పటికే 130 ఓట్లు పోలయ్యాయి. కంకణాలగూడెం ఎంపీటీసీ పరిధిలోని కొత్తగూడెంలో 13వ పోలింగ్ కేంద్రానికి కూడా జనగామ ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఇక్కడ 6 బ్యాలెట్ పేపర్లు ఉపయోగించగా 2 బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేశారు. నలుగురు ఓటర్లను ఓటు వేయకుండా అక్కడికే ఆపగా ఇద్దరు మాత్రం వాటిపైనే ఓటు వేశారు. అనంతరం ఆ ఇద్దరిని పిలిపించి సరైన బ్యాలెట్ పేప ర్లతో ఓటు వేయించారు. నల్లగొండ జిల్లా దేవరకొం డ మండల పరిధిలోని తెలుగుపల్లిలో కొన్ని బ్యాలెట్ పేపర్లలో కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసు కున్న అధికారులు బ్యాలెట్ పత్రాలను మార్పించడంతో సమస్య పరిష్కారమైంది.
Comments
Please login to add a commentAdd a comment