EVMలపై వైఎస్‌ జగన్‌ కీలక ట్వీట్‌, ఏమన్నారంటే.. YSR Congress Party Chief YS Jagan Mohan Reddy made key comments regarding EVMs. Sakshi
Sakshi News home page

EVMలపై వైఎస్‌ జగన్‌ కీలక ట్వీట్‌, ఏమన్నారంటే..

Published Tue, Jun 18 2024 8:26 AM | Last Updated on Tue, Jun 18 2024 10:56 AM

YS Jagan Ask Ballot Papers System Instead Of EVMs

ఈవీఎలంపై వైఎస్‌ జగన్‌ సంచలన ట్వీట్‌

కచ్చితంగా న్యాయం జరగాలి.. ప్రజాస్వామ్యం గెలవాలి: జగన్‌

అభివృద్ధి చెందిన దేశాల్లోనూ పేపర్‌ బ్యాలెట్లే వాడుతున్నారు: జగన్‌

ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగాలంటే మనమూ పేపర్‌ బ్యాలెట్‌ వాడాలి: జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైనా ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌, అన్‌లాకింగ్‌ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు.

‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్‌ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’’ అని అన్నారాయన.

2024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసిందే. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా... కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మస్క్‌ వ్యాఖ్యలను ఖండించారు. అయితే రాజీవ్‌ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్‌ ఇంకో ట్వీట్‌ చేస్తూ... ఏనీథింగ్‌ క్యాన్‌ బీ హ్యాక్డ్‌ అని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు... దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, సీ-డాక్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్‌ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవలి పరిణామమే.

ఈవీఎం 'అన్‌లాకింగ్'పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్‌ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్‌ జగన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement