ఆ పాఠశాలలో జెండా ఎగురవేయొద్దంటూ..
డంకావూర్(గ్రేటర్ నోయిడా): గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ గ్రేటర్ నోయిడాలోని డంకావూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ముస్లిం బాలికల పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసేందుకు కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాల ఉత్తరప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ గుర్తింపును అక్టోబర్ 2011లో పొందింది.
మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం పాఠశాల అధికారులు జెండా ఎగురవేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే, అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు జెండా ఎగురవేయడానికి వీల్లేదంటూ, ఏర్పాట్లు వదిలేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈవివాదం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో ఆ పాఠశాలలో తమ మతానికి విరుద్ధమైన బోధనలు చేస్తున్నారని స్కూల్ యాజమాన్యంపై ఆరోపించారు. అయితే, ఏదేమైనా జెండ వందనం అడ్డుకోవడానికి వీల్లేదంటూ, అలా చేస్తే చాలా కఠిన శిక్షలు ఎదుర్కొంటారని హెచ్చరించి వెనక్కి పంపారు.