Tricolour flag
-
మువ్వన్నెల జెండాతో చికెన్ శుభ్రం.. అరెస్ట్
Viral News: మువ్వన్నెల పతాకంతో చికెన్‌ను తుడిచిన ఓ వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్పందించిన అధికారులు జాతీయజెండాను అవమానించినందుకుగానూ అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. దాద్రా-నగర్ హవేలీకి చెందిన ఓ వ్యక్తి ఓ ఫ్రౌల్ట్రీ షాప్‌లో చికెన్‌ను జాతీయ జెండాతో శుభ్రం చేశాడు. అయితే అదంతా వీడియోను తీసిన ఓ వ్యక్తి.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది సిల్వస్సా పోలీసుల దాకా చేరింది. దీంతో జాతీయ జెండాను అవమానించినందుకు గానూ.. ‘‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడ్ని మొహమ్మద్ సైఫ్ నదీమ్ ఖురేషీగా గుర్తించారు. గురువారమే అతన్ని అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా జ్యూడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మున్సిపల్ శాఖ అతని దుకాణానికి సీజ్ వేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం.. జాతీయ జెండాను కాల్చినా, చించేసినా, మురికి అంటించినా, చెత్తలో పడేసినా, నాశనం చేసినా, పబ్లిక్‌గా తొక్కి అవమానించినా సరే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. న్యాయస్థానంలో అలాంటి వ్యక్తులకు మూడేళ్ల శిక్ష, జరిమానా లేదంటే రెండూ విధిస్తారు. Mohammad Saif Nadim Qureshi was seen cleaning chopped chicken using the national flag in Silvassa. And then they say " Don't question our Patriotism " ! pic.twitter.com/KtPjuYvrSl — Mohit Babu 🇮🇳 (@Mohit_ksr) April 22, 2023 -
స్వర్ణ దేవాలయం వద్ద మహిళకు చేదు అనుభవం..!
ఒక మహిళకు గోల్డెన్ టెంపుల్ చేదు అనుభవం ఎదురైంది. ముఖంపై జాతీయ జెండాను పెయింట్ వేసుకున్నందుకు పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశానికి నిరాకరించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో ఆ మహిళ ఇది భారతదేశం కాదా అని ప్రశ్నించింది. గార్డు అంతటితో ఆగకుండా ఇది పంజాబ్ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. గార్డు మాటలు విని మహిళ కంగుతింది. ఈ ఘటనను సదరు బాధితురాలు ఫోన్లో రికార్డు చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత గార్డు మహిల ఫోన్‌ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆమె అక్కడ నుంచి వెనుదిరిగింది. కాగా ఈ ఘటనపైపై గోల్డెన్ టెంపుల్ని నిర్వహించే శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ స్పందించి గార్డు దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరింది. అయితే ఆ మహిళ ముఖంపై ఉన్న జెండాపై ఆశోక చక్రం లేనందున అది రాజకీయ పార్టీ జెండా అయి ఉంటుందని భావించి ఉంటాడని వివరణ ఇచ్చింది. ఈ మేరకు దేవాలయ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ.. ప్రతి మత స్థలానికి దానికంటూ ఒక పత్యేక విధివిధానాలు ఉంటాయి. మేము ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాం. ఆ అధికారి ప్రవర్తించిన తీరుకి క్షమాపణలు కోరతున్నాం అని చెప్పారు. Woman denied entry to Golden Temple because she had a India 🇮🇳 flag painted on her face! The man who denied her entry into Golden Temple said this is Punjab, not India@AmitShah @PMOIndia @narendramodi @GoldenTempleInd @ArvindKejriwal Is bande ko Pakistan ke Punjab bhejo pic.twitter.com/nSgbOxVkoN — HARSH KESHRI (@HarshKeshri2209) April 17, 2023 (చదవండి: దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్ థాక్రే ఫైర్) -
Hyderabad: ఎటు చూసినా త్రివర్ణ శోభితమే! (ఫొటోలు)
-
‘హర్ ఘర్ తిరంగ’పై జవాన్ల సందేశం..12వేల అడుగుల ఎత్తుకు వెళ్లి మరీ..
లద్దాఖ్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’కు పిలుపునిచ్చింది కేంద్రం. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని కోరారు ఐటీబీపీ జవాన్లు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరిహద్దుల్లో 12వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు పలువురు జవాన్లు. ఆ వీడియోను సరిహద్దు గస్తి దళం ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో.. లద్దాఖ్‌లోని లేహ్‌లో భూమి నుంచి 12వేల అడుగుల ఎత్తున ఉన్న కొండ చివరి భాగంలో పలువురు జవాన్లు కూర్చుని ఉన్నారు. జాతీయ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘భారత్ మాతాకి జై. లద్దాఖ్‌లో 12వేల అడుగుల ఎత్తున ఐటీబీపీ దళాలు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాయి. 2022, ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నాం.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చింది ఐటీబీపీ. भारत माता की जय ! ITBP troops with Tricolour at 12 K feet in Ladakh with the message of 'Har Ghar Tiranga' to urge the citizens to hoist the Tricolour or display it in the homes between 13 to 15 August, 2022.#HarGharTiranga #AzadiKaAmrtiMohotsav pic.twitter.com/NpvS5coZY7 — ITBP (@ITBP_official) July 27, 2022 భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న క్రమంలో హర్ ఘర్ తిరంగా చేపట్టాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. దానికి తగినట్లుగా ఫ్లాగ్ కోడ్‌కు సవరణలు చేసింది. వారంలో రోజంతా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలు కల్పించింది. అలాగే.. జెండా తయారీకి ఉపయోగించే సామగ్రి, సైజ్‌లపై ఉన్న నియంత్రణలను సైతం ఎత్తివేసింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తోన్న హర్ ఘర్ తిరంగలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల జెండాలు ఎగురవేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈడీ పోలీస్ విభాగం కాదు.. అయినా అరెస్టులు సరైనవే: సుప్రీం కోర్టు -
జిన్నాటవర్‌కు జాతీయ జెండా రంగులు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నడిబొడ్డులో ఉన్న జిన్నాటవర్‌కు జాతీయ జెండా రంగులు అద్దారు. దీంతో గత కొద్ది రోజులుగా బీజేపీ నాయకులు జిన్నాటవర్‌పై చేస్తోన్న మత రాజకీయాలకు తెరపడినట్టయింది. నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం ఉదయం నుంచి జిన్నాటవర్‌కు జాతీయ జెండాలోని రంగులను వేసి సాయంత్రానికి పూర్తి చేశారు. ఇప్పటికే జిన్నాటవర్ చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. జెండా ఎగురవేసేందుకు దిమ్మెలను తయారు చేస్తున్నారు. రూ.5 లక్షలతో జిన్నాటవర్ సెంటర్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జిన్నాటవర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసేందుకు పాలకవర్గంతో, అధికారులు సంసిద్ధమయ్యారు. -
వివాదంగా మారిన నెమలి అంత్యక్రియలు
న్యూఢిల్లీ: సాధారణంగా యుద్ధాల్లో వీరమరణం పొందిన జవాన్లకు త్రివర్ణ పతాకం కప్పి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తారు. కానీ చనిపోయిన నెమలికి త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించి వివాదంలో చిక్కుకున్నారు ఢిల్లీ పోలీసులు. గత శుక్రవారం ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చనిపోయిన నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి బాక్స్‌లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఈ ఘటన వివాదస్పదంగా మారింది. పోలీసులు అలా అంత్యక్రియలు నిర్వహించడం సబబు కాదని పలువురు వన్యప్రాణి ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ‘ వన్యప్రాణి సంరక్షణ ప్రకారం ఇలాంటి పక్షులు చనిపోతే రాష్ట్ర అటవీ శాఖ వాటికి పోస్ట్‌మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఇది పోలీసులు చేయాల్సిన పని కాదు’ అని వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త గౌరి మౌలేక్ పేర్కొన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ..‘ నెమలి మన జాతీయ పక్షి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. మేం ప్రొటోకాల్‌ను పాటించాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని తెలిపారు. -
కాషాయ జెండా కూడా జాతీయ పతాకమే!
ముంబై: 'భారత్ మాతా కీ జై' నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారకముందే ఆర్ఎస్ఎస్ కు చెందిన మరో నేత సరికొత్త వివాదానికి తెరలేపారు. హిందూత్వకు ప్రతీక అయిన కాషాయ జెండాను జాతీయ పతాకంతో సమానంగా గౌరవించాలన్నారు. ముంబైలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండాను జాతీయ పతాకంతో సమానంగా గౌరవిచడంలో తప్పులేదని, రెండు జెండాలకు మధ్య పెద్దగా తేడా లేదన్నారు జోషి. మూడు రంగుల జెండా రూపొందించకముందు బ్రీటిష్ పాలనకు వ్యతిరేకంగా కాషాయ జెండాను ఎగురవేసేవారని గుర్తుచేసిన ఆయన జాతీయ గేయమైన 'వందేమాతరం'ను కూడా జాతీయ గీతంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. 'రాజ్యాంగం ప్రకారం జాతీయ గీతం అయిన 'జన గణ మన'కు మనం కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అదే విధంగా సంపూర్ణ అర్థాన్ని బట్టి చూస్తే వందేమాతరం జాతీయగీతమే' అని జోషి అన్నారు. కాగా, జోషి వ్యాఖ్యలపై జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) మండిపడింది. కశ్మీర్ వేర్పాటువాదులకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పెద్దగా తేడాలేదని, కశ్మీర్ వేర్పాటువాదులలాగే ఆర్ఎస్ఎస్ కూడా మూడురంగుల జెండాకు గౌరవం ఇవ్వదని, జోషీ వ్యాఖ్యలు జాతీయ జెండాను అవమానించేలా ఉన్నాయని జేడీయూ నేతలు మండిపడ్డారు. -
207 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగరాలి!
* సెంట్రల్ వర్సిటీల వీసీ భేటీలో స్మృతి ఇరానీ * కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సీపీఎం సూరజ్‌కుండ్: విద్యార్థుల్లో జాతీయ భావన పెంచేందుకు దేశంలోని 46 సెంట్రల్ వర్సిటీల్లో ప్రతిరోజూ 207 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగరేయాలని వీసీల సమావేశం నిర్ణయించింది. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో సూరజ్‌కుండ్‌లో జరిగిన సెంట్రల్ వర్సిటీల వీసీల సమావేశంలో ఈమేరకు తీర్మానం చేశారు. తొలి పతాకాన్ని జేఎన్‌యూలో ఎగురవేయనున్నారు. ఇప్పటికే వర్సిటీల్లో జాతీయ జెండా ఎగురుతోంది. అయితే.. అన్ని చోట్లా దీని ఎత్తు సమానంగా ఉండాలని నిర్ణయించారు. 2012 యూజీసీ చట్టం (వర్సిటీల్లో సమానత్వ భావన పెంచటం, ఎస్సీ, ఎస్టీల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించటం) అమలుపై ల చర్చించారు. కాగా, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. జాతీయ పతాకాన్ని ఎగరేయటం, వందేమాతర గీతాన్ని ఆలపించటం వల్లే జాతీయ భావం పెంపొందుతుందా అని ప్రశ్నించింది. సీపీఎం నాయకురాలు బృందా కారత్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. -
ఆ పాఠశాలలో జెండా ఎగురవేయొద్దంటూ..
డంకావూర్(గ్రేటర్ నోయిడా): గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ గ్రేటర్ నోయిడాలోని డంకావూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ముస్లిం బాలికల పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసేందుకు కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాల ఉత్తరప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ గుర్తింపును అక్టోబర్ 2011లో పొందింది. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం పాఠశాల అధికారులు జెండా ఎగురవేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే, అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు జెండా ఎగురవేయడానికి వీల్లేదంటూ, ఏర్పాట్లు వదిలేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈవివాదం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో ఆ పాఠశాలలో తమ మతానికి విరుద్ధమైన బోధనలు చేస్తున్నారని స్కూల్ యాజమాన్యంపై ఆరోపించారు. అయితే, ఏదేమైనా జెండ వందనం అడ్డుకోవడానికి వీల్లేదంటూ, అలా చేస్తే చాలా కఠిన శిక్షలు ఎదుర్కొంటారని హెచ్చరించి వెనక్కి పంపారు. -
'కాంగ్రెస్ కు హస్తం గుర్తు వద్దు'
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు త్రివర్ణ పతకాలు వాడకుండా నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ కు ఢిల్లీ బీజేపీ కార్పొరేటర్ సిమ్మీ జైన్ కోరారు. కాంగ్రెస్ జెండా నుంచి హస్తం గుర్తును కూడా ఉపసంహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, కమిషనర్లు హెచ్ ఎస్ బ్రహ్మ, ఎన్ఎన్ఏ జైదీలకు ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీలు జాతీయ జెండా లాంటి పతకాలు వాడకుండా చూడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు రద్దు చేసి కొత్త గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా?
తెల్లవాడి గుండెల్లో బాకు దించినా.. ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేసినా.. అది మధ్యతరగతి మేధావి వర్గం వల్లే సాధ్యమైందంటారు ప్రముఖ కవి, సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెగువతో తెగించి పోరాడిన ఆ వర్గం... ఇపుడు మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛా భారతంలో అన్యాయాన్ని నిలదీసి సత్తా చాటడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాన్ని బలిగోరే సమాజంపై కన్నెర్ర చేయడం లేదని నిగ్గదీస్తున్నారు. అయితే.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు పదునెక్కిన ఆలోచనలతో ముందుకొస్తారని ఆకాంక్షిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. సిరివెన్నెల మదిలో ఉప్పొంగిన ఆవేశమే ఇక్కడ అక్షరరూపమైంది. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా? ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా? దానికి సలాము చేద్దామా? .. సగటు మనిషిలో రగిలిపోయే ఆవేశమిది. శాంతి కపోతపు కుత్తుక తెగిపోతున్న వేళ.. తెగిపడిన తలే భారతావని నుదుట సింధూరమైన వేళ.. సామాన్యుడి స్పందన ఇలాగే ఉంటుందేమో? ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా? పోయిందా? అన్న సందేహమే కల్గిస్తుందేమో? ఈ దేశాన్ని కొల్లగొట్టి, గుల్లచేసిన తెల్లవాడిని తరిమికొట్టడానికి ఏకమైన జాతి ఇప్పుడెందుకు నైరాశ్యంలో ఉంది? స్వాతంత్య్రం అనే భావజాలం కోసం ఒకే మాట, ఒకే బాట ఎంచుకున్న భారతీయులు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? స్వాతంత్య్రం వచ్చాక యావత్ భారతావని ఏకమైన సందర్భాలేంటి? చైనా, పాకిస్తాన్‌తో యుద్ధం సమయమో.. క్రికెట్ కప్పు గెలుపోటముల్లోనో తప్ప మన కోసం.. భావి తరం కోసం ఏకమయ్యే పరిస్థితి లేదా? నిజాన్ని బలిగోరే సమాజమెందుకు? గాంధీ కోరింది దేశానికి స్వాతంత్య్రమే కాదు. గ్రామ స్వరాజ్యం కూడా. దశాబ్దాలుగా ఈ లక్ష్యాన్ని సాధించలేకపోయాం. సురాజ్యమవ్వలేని స్వరాజ్యాన్నే గొప్పగా చెప్పుకుంటున్నాం. సుఖాన మనలేని వికాసాన్నే ప్రగతి సంకేతమంటున్నాం. నిజాన్ని బలిగోరే సమాజాన్నే చూస్తున్నాం. తెల్లవాడు రాకముందు ఈ దేశంలో వికేంద్రీకరణ ఉండేది. ఏ ఊళ్లో పాలన ఆ ఊరిలోనే. అక్కడే తీర్పులు, అక్కడే శిక్షలు. అప్పట్లో ఊరిలోనే పని దొరికేది. ఇప్పుడు మనం చెప్పుకునే సర్వసత్తాక ప్రజాస్వామ్యం పల్లెల్లోనే కన్పించేది. ధార్మిక సంబంధాలే తప్ప పొరుగూరితోనూ పనిలేని వ్యవస్థ మన పల్లెల సొంతం. బ్రిటీష్ వాళ్లు దీనిపై దెబ్బకొట్టారు. వికేంద్రీకరణతో గ్రామీణ భారతాన్ని ఛిన్నాభిన్నం చేశారు. న్యాయం కోసం, ఉపాధి కోసం మైళ్ల కొద్దీ వెళ్లే పరిస్థితి తెచ్చారు. ఆ పద్ధతినే మనం అనుసరిస్తున్నాం. ఈ భావదారిద్య్రం నుంచి బయటపడేదెప్పుడు? మెకాలేకు మొక్కాలా? ఇంగ్లీష్ మాట్లాడకపోతే దేశద్రోహమని భావించే విద్యా సంస్థలు.. దాన్ని ప్రోత్సహించడమే ఫ్యాషన్ అనే తల్లిదండ్రులు మారేదెన్నడు? ఇంగ్లీషోడి భాషను ఇంకా ఇంపుగా ఆదరించడమంటే.. తెల్లవాడి భావజాలం నుంచి మనం బయటపడనట్లేగా. విశ్వవ్యాప్తంగా దూసుకెళ్లే చైనా, రష్యా వంటి దేశాలు స్వదేశీ భాషకే పట్టం కడుతున్నా.. మనకేంటీ దుర్గతి? బానిసత్వపు ఆలోచనలనే భావి తరాలకు బోధించడాన్ని కార్పొరేట్ విద్యగా పేర్కొనడం అన్యాయమే. తెలుగు చదవలేని, మాట్లాడలేని దౌర్భాగ్యంలో ఉంటే స్వాతంత్య్రం వచ్చినట్టేనా? మెకాలే విద్యావ్యవస్థ ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానమే లేదు. ఆధునికతా? అధోగతా? మూడు దశాబ్దాల క్రితం ఈ దేశంలో కంప్యూటర్ వాడకం మొదలైంది. అంతకు ముందు ఇండియా అనేక రంగాల్లో ఎన్నో దేశాలకు పోటీ ఇచ్చింది. విజ్ఞాన వీచికలు పంచుతూ అమెరికాకే ఆదర్శమైంది. శాస్త్ర,సాంకేతిక పురోగతి అందివచ్చాక.. ఆ వేగం ఎందుకు కుంటుపడింది? పరిశోధన రంగం జాడలు బలంగా కన్పించవెందుకు? వందమంది పని ఒక్క కంప్యూటర్ చేస్తుంటే, 99 మంది రోడ్డున పడుతున్నారే? ఆధునిక యంత్రం.. సంప్రదాయ వృత్తులను నుజ్జునుజ్జు చేస్తుంటే పట్టించుకోరే? నేలతల్లే భారమైన దయనీయ స్థితి.. దీన్నేనా మనం ప్రగతి అంటున్నాం? నిజం తెలుసుకోరే.. భుజం కలిపి రారే? ఒకప్పుడు మతం మన బలం. కులం ఉపాధి గుణం. ఈ రెండూ జాతిని ఏకం చేశాయి. స్వాతంత్య్రం తర్వాత పరిస్థితి ఏమిటి? కులం రాజకీయమైంది. మతం వికృత భావజాలమై సమాజంలోకి వచ్చింది. కులాల కోసం గుంపులు కట్టే దుస్థితి దాపురించింది. మతాల కోసం మంటలు పెడుతున్న వైనం కన్పిస్తోంది. భారతావని బంధనాలు తెంచే క్రమంలో కులమతాలు అడ్డొచ్చాయా? ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులూ ముక్త కంఠంతో నినదించలేదా? ఇవన్నీ ఇప్పుడెందుకు మరచిపోతున్నాం. ముస్లింలు ఈ దేశ పౌరులు కాదనే హక్కు ఎవరికి ఉంది? దేశం కోసం వాళ్లూ ప్రాణాలర్పించలేదా? దేశాభివృద్ధిలో పాలుపంచుకోలేదా? రక్తసిక్తమైన జలియన్‌వాలా బాగ్‌లో పేలిన వందల తూటాలూ డయ్యర్వేనా? స్వార్థంతో తెల్లవాడి పంచన ఉద్యోగం చేసినవాళ్లవి లేవా? వాళ్లలో ఎవరిది ఏ కులం? ఎవరిది ఏ మతం? సమాజ క్షేమం పట్టని స్వార్థం.. ఇరుకుతనంతో ముడుచుకుపోతే ఈ జనం నిజమెలా తెలుసుకుంటారు? నిరాశావాదమే కారణమా? నిరాశావాదం బలహీన భావనలకు ఆజ్యం పోస్తుంది. ఈ దేశంలో జరిగింది అదే. స్వేచ్ఛ కోసం పోరాడిన జనం.. ఒక్కసారిగా నిరాశావాదంలోకి వెళ్లారు. స్వార్థ ప్రయోజనాలకే పరిమితమయ్యారు. నిర్దేశిత లక్ష్యాలు లేకుండా పోయాయి. ఫలితంగా తొందరపాటు నిర్ణయాలు జరిగాయి. కార్పొరేటీకరణ, సరళీకరణ, ఆర్థిక సంస్కరణల పర్వం.. ఇలా ఏదైనా పరాయి వాడి వ్యాపారమే పరమాన్నమైంది. పేదవాడి బతుకు బుగ్గయినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రజలూ కారణమే. అప్పుడప్పుడూ ఆవేశం వస్తుంది? ఆ క్షణంలో మార్పు కోసం ఏకమవుతారు. అంతలోనే చల్లబడతారు. పాలకులే అన్నీ చూసుకుంటారని ఊరుకుంటారు. ఆటవికన్యాయం మారదేం? ఒక జంతువు ఆకలి తీర్చుకోవడానికే వేటాడుతుంది. ఆ క్రమంలో ఎదుటి జంతువు ఏంటని చూడదు. తనదా? పరాయిదా? అన్న భావన రాదు. కానీ మనిషి ఆకలి కోసం దోచుకోవడం లేదు. సంపద కూడబెట్టాలనుకుంటున్నాడు. జంతువుకన్నా హీనంగా ఉన్న భావనలను ఏమని సంబోధించాలి? ఈ భావజాలంతో సమాజాభివృద్ధి ఎలా సాధ్యం? ధర్మాగ్రహమే ముఖ్యం జాతి నిర్మాణం చాలా అలస్యమవుతుంది. కానీ కూల్చివేయడం క్షణాల్లో పని. నిర్మాణాత్మక ఆలోచనలు జనంలోనూ ఉన్నాయి. కాకపోతే అవి వాళ్ల వద్దే ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ అయితే మంచి, చెడును అన్ని ప్రాంతాలవాళ్లూ సమానంగా నిర్ణయిస్తారు. హైదరాబాద్‌లో వచ్చిన అభిప్రాయమే వైజాగ్‌లోనూ వస్తుంది. ఈ దేశం బాగుపడాలని అంతా అనుకుంటారు. దాన్ని నిలదీసి అడగలేరు. ‘నేనొక్కడిని అడిగి ఏం లాభం’ అన్న భావనతో ఉంటారు. ఇలా పక్కవాడు ఆలోచిస్తాడని ఎందుకు అనుకోరు? ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..’ అన్నప్పుడు ‘అబ్బ.. ఏం అడిగాడు’ అన్నారే తప్ప, ఆ జనంలో తానూ ఉన్నానని గుర్తించరా? ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు! ఈ దేశంలో మార్పు కేవలం మధ్య తరగతి మేధావి వర్గం నుంచే సాధ్యం. స్వాతంత్రోద్యమ కాంక్ష రగిలించినా, విప్లవోద్యమ కెరటాలు సృష్టించినా, భారతమాత పాపిట రక్త సింధూరమైనా.. అందుకు కారణం మధ్య తరగతి మేధావే. బతుకు పోరాటమే జీవన విధానమయ్యే ఈ వర్గం అప్పుడప్పుడు ఆలోచిస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఈ ఆలోచన ఒకే రకంగా ఉంటుంది. ఆ ఆలోచనల తీర్పు ఊహించని విధంగా ఉంటుంది. కానీ వాళ్లు ఉదాసీనంగా ఉంటారు. వేదనలు, రోదనలు పరిమితి మించినప్పుడు మార్పు కోసం సమైక్యంగా గళమెత్తుతారు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి పురాణాలు తిరగేయక్కర్లేదు. రామాయణ, భారత గ్రంథాలు చదవక్కర్లేదు. మనిషిని బంధించగలరేమో కానీ.. ఆలోచించే మనసును బంధించడం ఎవరి వల్లా కాదు. మన చేత్తోనే మన ఇంటి వస్తువులు భోగి మంట వేసుకుని ఆనందించే పరిస్థితి నుంచి.. ఆలోచించి అడుగేసే రోజు వస్తుంది.. అదీ మధ్యతరగతి ఇంటి నుంచే! - వనం దుర్గాప్రసాద్