Woman With Tricolour Painted on Face Denied Entry to Golden Temple - Sakshi
Sakshi News home page

స్వర్ణ దేవాలయం వద్ద మహిళకు చేదు అనుభవం.. ముఖంపై!

Published Mon, Apr 17 2023 2:12 PM | Last Updated on Mon, Apr 17 2023 2:32 PM

Woman With Tricolour Painted on Face Denied Entry To Golden Temple - Sakshi

ఒక మహిళకు గోల్డెన్‌ టెంపుల్‌ చేదు అనుభవం ఎదురైంది. ముఖంపై జాతీయ జెండాను పెయింట్‌ వేసుకున్నందుకు పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశానికి నిరాకరించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో ఆ మహిళ ఇది భారతదేశం కాదా అని ప్రశ్నించింది. గార్డు అంతటితో ఆగకుండా ఇది పంజాబ్‌ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. గార్డు మాటలు విని మహిళ కంగుతింది. ఈ ఘటనను సదరు బాధితురాలు ఫోన్‌లో రికార్డు చేయడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ తర్వాత గార్డు మహిల ఫోన్‌ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆమె అక్కడ నుంచి వెనుదిరిగింది. కాగా ఈ ఘటనపైపై గోల్డెన్‌ టెంపుల్‌ని నిర్వహించే శిరోమణి గురుద్వార్‌ పర్బంధక్‌ కమిటీ స్పందించి గార్డు దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరింది. అయితే ఆ మహిళ ముఖంపై ఉన్న జెండాపై ఆశోక చక్రం లేనందున అది రాజకీయ పార్టీ జెండా అయి ఉంటుందని భావించి ఉంటాడని వివరణ ఇచ్చింది.

ఈ మేరకు దేవాలయ ప్రధాన కార్యదర్శి గురుచరణ్‌ సింగ్‌ గ్రేవాల్‌ మాట్లాడుతూ.. ప్రతి మత స్థలానికి దానికంటూ ఒక పత్యేక విధివిధానాలు ఉంటాయి. మేము ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాం. ఆ అధికారి ప్రవర్తించిన తీరుకి క్షమాపణలు కోరతున్నాం అని చెప్పారు. 

(చదవండి: దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్‌ థాక్రే ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement