'కాంగ్రెస్ కు హస్తం గుర్తు వద్దు'
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు త్రివర్ణ పతకాలు వాడకుండా నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ కు ఢిల్లీ బీజేపీ కార్పొరేటర్ సిమ్మీ జైన్ కోరారు. కాంగ్రెస్ జెండా నుంచి హస్తం గుర్తును కూడా ఉపసంహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, కమిషనర్లు హెచ్ ఎస్ బ్రహ్మ, ఎన్ఎన్ఏ జైదీలకు ఫిర్యాదు చేశారు.
రాజకీయ పార్టీలు జాతీయ జెండా లాంటి పతకాలు వాడకుండా చూడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు రద్దు చేసి కొత్త గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.