సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధానికి అత్యంత చేరువలో ఉన్న నోయిడా సిగలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. దేశంలోనే అత్యంత పొడవైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ) నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై రూపుదిద్దుకోనుంది. ఈ బ్రిడ్జి పొడవు 160 కి.మీ ఉండనుంది. దీని నిర్మాణం కోసం రూపొందించిన అంచనాను ఐఐటీ-ఢిల్లీకి పంపారు. మూడు నాలుగు నెలల వ్యవధిలో పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. దీని నిర్మాణానికి ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే కారణంగా ఓవైపు నుంచి మరో వైపునకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఇందుకోసం ఐదు మినీ అండర్‌పాస్‌లను నిర్మించినప్పటికీ అంతదూరం నడవలేక ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను దూకి వెళ్లేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందువల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ స్థానికులు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై మొత్తం ఆరు ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలంటూ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సిఫారసు చేసింది. వీటిలో ఎమిటీ యూని వర్సిటీకి ఎదుట ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇప్పటికే నిర్మిం చారు. మిగతా ఐదింటిని నిర్మించాల్సి ఉంది. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను సెక్ట్టార్126 / 127 డివైడింగ్ రోడ్‌కు, సెక్టార్ 97కు మధ్య నిర్మిస్తారు.
నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై దేశంలోనే పొడవైన ఎఫ్‌ఓబీ
Published Wed, Jun 25 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM
Advertisement
Advertisement