FOB
-
Hyderabad: భవనం కాదండోయ్.. మరేంటో మీరే తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: కింది ఫొటోలో కనిపిస్తున్నది భవనం కాదు. పాదచారులు సదుపాయంగా రోడ్డు దాటేందుకు నిర్మించనున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి నమూనా. నగరంలో పాదచారులు రోడ్డు దాటేందుకు పడుతున్న అవస్థలు, ప్రమాదాలు తగ్గించేందుకు ఇప్పటికే వివిధ చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అందులో భాగంగా నిర్మిస్తున్న ఎఫ్‌ఓబీల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ పద్ధతిలో అధునాతనంగా ఈ ఎఫ్ఓబీని నిర్మించేందుకు సిద్ధమైంది. బంజారాహిల్స్ జీవీకేమాల్ వద్ద అత్యంత ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రీడీ విధానంలో, పాదచారులు సదుపాయంగా రోడ్డు దాటేలా ఫొటోలో మాదిరి నిర్మించనుంది. పనులు పురోగతిలో ఉన్న ఈఎఫ్‌ఓబీని వీలైనంత త్వరితంగా పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రూ. 5కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ స్టీల్‌తో నిర్మిస్తున్న ఈ ఎఫ్ఓబీ వివరాలిలా ఉన్నాయి. ►పొడవు : 54.97 మీటర్లు. ►రెండు వైపులా లిఫ్టులు. ఒక్కో లిఫ్టులో ఒకేసారి పదిమంది వెళ్లవచ్చు. ►రెండు ఎస్కలేటర్లు ►8 సీసీకెమెరాలు ►ఇప్పటి వరకు 43 ఎఫ్ఓబీల పనులు చేపట్టగా వాటిల్లో 21 ఎఫ్‌ఓబీలు పూర్తయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. -
చేతులెత్తేశారు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రోడ్డు దాటడంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు 52 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు(ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు), 8 జంక్షన్లలో స్కైవేల టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఈ పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యేలాలేవు. నగరంలో ఎఫ్ఓబీల పనులు ఒకడుగు ముందుకు.. వందడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే తంతు. గతంలో ఎఫ్‌ఓబీలను నిర్మించే కాంట్రాక్టు ఏజెన్సీలకు వాటిపై ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలో నిర్మించేవారు. ఆ విధానంలో ప్రజలకు ఉపయుక్తమైన ప్రాంతాల్లో కాకుండా కేవలం ప్రకటనల ఆదాయం కోసం..అవసరం లేని ప్రాంతాల్లో నిర్మిస్తున్నారనే ఆరోపణలతోపాటు, ప్రజలు నడిచేందుకంటే ప్రకటనల కోసమే వాటిని ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు రావడంతో అప్పటికే పిలిచిన టెండర్లను సైతం రద్దు చేసి ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కొత్త పద్ధతిలో భాగంగా ఎఫ్ఓబీల కయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలే భరిస్తాయి. వాటిపై ప్రకటనల ఆదాయం కోసం టెండర్లను ఆహ్వానించాలనేది యోచన. తద్వారా ఎఫ్‌ఓబీలపై ప్రకటనల స్థలాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు ప్రయోజనకరంగా మాత్రమే వీటిని కట్టాలని భావించారు. అందులో భాగంగా పాతవాటినన్నింటినీ పక్కనబెట్టి గత జూలైలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, టెండర్లను ఆహ్వానించారు. 52 ప్రాంతాల్లో ఎఫ్ఓబీలతోపాటు 8 జంక్షన్లలో స్కైవేల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. నాలుగు ప్యాకేజీలకు గాను కేవలం ఒకే ప్యాకేజీ (ఎల్బీనగర్ జోన్)కి ఒకే ఒక్క టెండరు దాఖలైంది. మిగతా మూడు ప్యాకేజీలకు అసలు టెండర్లే రాలేదు. తిరిగి పిలుద్దామనుకునేలోగా ముందస్తు ఎన్నికల ప్రకటన రావడంతో పిలిచే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చిన టెండరు అగ్రిమెంట్ పూర్తికాకపోవడంతో అదీ స్తంభించింది. ఎన్నికలు పూర్తయితే కానీ.. తిరిగి టెండర్లు పిలిస్తే అప్పటికైనా కాంట్రాక్టర్లు వస్తారో, రారో తెలియని పరిస్థితి. కారణాలెన్నో... ఎఫ్ఓబీలంటే వ్యాపార ప్రకటనల ఆదాయాన్నే ప్రధానంగా భావించే కాంట్రాక్టర్లు కొత్త విధానం తమకు లాభసాటి కాదని రాలేదని తెలుస్తోంది. దాంతోపాటు తమ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ కాకుండా నిర్దిష్ట ప్రాంతాల్లోనే నిర్మించాల్సి ఉండటం.. నిర్ణీత వ్యవధి వరకు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టాల్సి ఉండటంతో వెనుకడుగు వేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఒక్కో ప్యాకేజీ విలువ రూ. 40 కోట్ల నుంచి రూ. 75 కోట్ల వరకు ఉండటంతో టెండర్లలో పాల్గొనాలంటే నిర్ణీత వ్యవధిలో అందులో 50 శాతం మేర విలువైన పనుల్ని పూర్తిచేసి ఉండాలి. ఈ నిబంధనతో కాంట్రాక్టర్లు ముందుకు రారనే గత అనుభవాలతో 25 శాతం మేర విలువైన పనులకు పరిమితం చేస్తూ నిబంధన సడలించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని త్వరత్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ఊహ కూడా లేని తరుణంలోనే టెండర్లు పిలిచినప్పటికీ.. ఎన్నికల దృష్టితో ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోసహ వివిధ పనుల్ని త్వరితంగా పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరగడాన్ని పరిగణనలోకి తీసుకొని వెనుకడుగు వేసినట్లు సమాచారం. స్టీల్ స్కైవేలు.. ఎఫ్‌ఓబీలతో పాటు అత్యంత రద్దీ ఉన్న ఎనిమిది జంక్షన్లలో స్టీల్ స్కైవేలు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.ఆయా జంక్షన్లలోని పరిస్థితుల కనుగుణంగా ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్లేందుకైనా వర్తులాకారంలో, త్రిభుజారకారంలో, చతురస్రాకారంలో వీటిని ఏర్పాటు చే సేందుకు టెండర్లు పిలిచారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నాలుగు వైపులకు వెళ్లేలా, మెహదీపట్నంలో మూడు వైపులకు వెళ్లేలా స్కైవేలు నిర్మించాల్సి ఉంది. మొత్తం 52 ఎఫ్‌ఓబీల్లో 39 ఎఫ్‌ఓబీలకు అవసరమైన రూ. 75 కోట్లు హెచ్ఎండీయే, మిగతావి జీహెచ్ఎంసీ నిధుల నుంచి వెచ్చించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్యాకేజీలు.. అంచనా వ్యయం .. ప్యాకేజీ–1(ఎల్బీనగర్జోన్): 11 ఎఫ్‌ఓబీలు, 1 స్కైవే : రూ. 40.14కోట్లు ప్యాకేజీ–2(చార్మినార్‌జోన్): 11 ఎఫ్‌ఓబీలు, 1 స్కైవే : రూ. 37.93 కోట్లు ప్యాకేజీ–3(ఖైరతాబాద్,సికింద్రాబాద్ జోన్లు):16 ఎఫ్‌ఓబీలు, 4 స్కైవేలు:రూ. 75.79 కోట్లు ప్యాకేజీ–4(కూకట్పల్లి,శేరిలింగంపల్లి జోన్లు)) : 14 ఎఫ్‌ఓబీలు, 2 స్కైవేలు: రూ. 53.85 కోట్లు. స్కైవేలు ఎక్కడెక్కడ.. 1.ఉప్పల్ రింగ్‌రోడ్డు 2.ఆరాంఘర్ చౌరస్తా 3.ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 4.లక్డీకాపూల్ 5.రోడ్ నెంబర్ 1, 12 జంక్షన్, బంజారాహిల్స్ 6.మెహదీపట్నం 7.సుచిత్రా జంక్షన్ 8.బోయిన్పల్లి క్రాస్‌రోడ్ ఎఫ్‌ఓబీలు ఎక్కడ.. రామకృష్ణామఠం (ఇందిరాపార్కు ఎదుట), చిలకలగూడ రింగ్‌రోడ్, మహావీర్ హాస్పిటల్, చెన్నయ్ షాపింగ్‌మాల్(మదీనగూడ), హైదరాబాద్ సెంట్రల్‌మాల్, ఆల్విన్‌క్రాస్‌రోడ్స్ (మియాపూర్), ఉప్పల్ రింగ్‌రోడ్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ (రామంతాపూర్), ఇందిరానగర్ జంక్షన్(గచ్చిబౌలి), నేరెడ్మెట్ బస్టాప్, గాంధీ హాస్పిటల్, కేవీఆర్ కాలేజ్(సంతోష్‌నగర్), గెలాక్సీ(టోలిచౌకి), ఆరె మైసమ్మటెంపుల్ (లంగర్‌హౌస్), సాయిసుధీర్‌కాలేజ్(ఏఎస్‌రావునగర్), రాయదుర్గం జంక్షన్, ఒయాసిస్ స్కూల్(షేక్‌పేట), ఈఎస్ఐ హాస్పిటల్(ఎర్రగడ్డ), విజేత సూపర్ మార్కెట్(చందానగర్), వర్డ్ అండ్ డీడ్ స్కూల్ (హయత్‌నగర్), హెచ్ఎండీఏ(మైత్రివనం), జీడిమెట్ల బస్టాప్, నోమ ఫంక్షన్ హాల్(మల్లాపూర్), రంగభుజంగ థియేటర్(షాపూర్‌నగర్), స్వప్న థియేటర్(రాజేంద్రనగర్), సన్‌సిటీ(బండ్లగూడ), సుచిత్ర సర్కిల్, ఐడీఏ ఉప్పల్, విశాల్‌మార్ట్(అంబర్‌పేట), బిగ్‌బజార్(ఐఎస్ సదన్), దుర్గానగర్ టి జంక్షన్, సుష్మ థియేటర్ (వనస్థలిపురం), నెహ్రుజూలాజికల్‌పార్క్, ఓల్డ్కర్నూల్రోఓడ్ టి జంక్షన్(ఉందానగర్ దగ్గర), అపోలో హాస్పిటల్(సంతోష్‌నగర్), ఒమర్ హోటల్, సైబర్ గేట్‌వే(హైటెక్‌సిటీ) తదితర ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. -
పాదచారికి జై..
* జంక్షన్ల ఆధునికీకరణ, ఎఫ్‌వోబీల ఏర్పాటు * అధ్యయనం చేసిన ట్రాఫిక్ పోలీసులు * ప్రభుత్వానికి చేరిన సమగ్ర నివేదిక * రెండు విడతల్లో పనులు..! సాక్షి, సిటీబ్యూరో: ‘పాదచారే రోడ్డుకు రాజు’.. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఈ నానుడి నగరానికి మాత్రం సరిపోవడం లేదు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో పాదచారులది రెండో స్థానం. సిటీలో ఈ పరిస్థితులు నెలకొనడానికి అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం.. ట్రాఫిక్ స్థితిగతులను చక్కదిద్దేందుకు అధ్యయనం చేయించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించిన ట్రాఫిక్ పోలీసులు పాదచారి భద్రతకు పెద్దపీట వేశారు. అనేక కోణాల్లో జంక్షన్ల అభివృద్ధి సిటీలోని ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిలో పాదచారుల కోణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం సిటీలో ప్రధానంగా నాలుగు రకాల జంక్షన్లు ఉన్నాయి. నాలుగు కంటే ఎక్కువ రహదారులు కలిసే జంక్షన్లు, నాలుగు రోడ్లు కూడళ్ల చౌరస్తాలతో పాటు మూడు రోడ్లతో కూడిన ‘టి’, ‘వై’ జంక్షన్లు ఉన్నాయి. ఇలా ప్రతి జంక్షన్‌లోనూ పాదచారులు రోడ్డు దాటేందుకు కచ్చితంగా ప్రత్యేక మార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. రెడ్ సిగ్నల్ పడేదాకా చౌరస్తాలో వేచి ఉండేందుకు రోడ్డుకు పక్కగా సౌకర్యవంతంగా ఉండే ప్లాట్‌ఫాములు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రెయిలింగ్స్, హూటర్స్.. ఆయా జంక్షన్లలో పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో తనచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేదుకు రెయిలింగ్స్ ఏర్పాటును సూచించారు. జంక్షన్ స్థాయిని బట్టి అన్ని రోడ్లలోకూ ఎడమ వైపు ఫుట్‌పాత్‌ను అనుసరించి 100 నుంచి 200 మీటర్ల వరకు రెయిలింగ్ ఏర్పాటు చేస్తారు. రోడ్ క్రాసింగ్ మార్క్ ఉన్న ప్రాంతంలో వీటికి ఓపెనింగ్ ఇస్తారు. ఫలితంగా పాదచారి ఆ ప్రాంతంలో మాత్రమే రహదారి దాటే వీలుంటుంది. అంధులు రోడ్డు దాటుతున్న సమయంలో ఆ విషయం వాహన చోదకులకు స్పష్టంగా తెలిసేలా ‘హూటర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక శబ్దం చేసే ఈ హూటర్ సదరు పాదచారి రోడ్డు దాటే వరకు మోగుతూనే ఉంటుంది. ప్రత్యేక డిజైన్‌తో ఎఫ్‌వోబీలు జంక్షన్లు, రోడ్డు క్రాసింగ్‌కు అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల (ఎఫ్వోబీ) ఏర్పాటుకు ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రతిపాదించారు. వీటితోపాటు పాదచారులు రోడ్డు దాటేం దుకు అవకాశమున్న వాణిజ్య, విద్యా కేంద్రాలు ఎక్కువగా ఉన్న చోట్లా వీటిని నిర్మించాలని సూచించారు. ప్రధానంగా దిల్సుఖ్నగర్, కోఠి, బేగంబజార్, అమీర్‌పేట్, మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వీటి ప్రాధాన్యం ఎక్కువని నివేదించారు. గతంలో మాదిరిగా కేవలం బ్రిడ్జి మాత్రమే నిర్మించకుండా ప్రతి ఎఫ్‌వోబీకి లిఫ్ట్, జనరేటర్ సౌకర్యం కచ్చితంగా ఉండాలని, అప్పుడే వీటి వినియోగం ఆశించిన స్థాయిలో ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. ‘మెట్రో’పై ప్రత్యేక దృష్టి నగరంలో మెట్రో రైల్ ప్రారంభమైన తర్వాత ఆయా ప్రాంతాల్లో పాదచారుల తాకిడి పెరుగుతుందని ట్రాఫిక్ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో స్టేషన్లో రైలు దిగి సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, ఆటో స్టాండ్లకు చేరుకునే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు. దీనికోసం మెట్రో స్టేషన్లు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ‘స్కై వాక్స్’ సాధ్యం కావని భావిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మల్టీ డెరైక్షన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉండే ఎఫ్‌వోబీల అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సాధారణంగా ఎఫ్‌వోబీలు ఒక మార్గంలో ఎక్కి, మరో మార్గంలో దిగేందుకు ఉపకరిస్తాయి. ‘మెట్రో’ వద్ద ఏర్పాటు చేసేవి ఆ స్టేషన్ నుంచి ఎంట్రీ ఉన్నా.. గరిష్టంగా మూడు మార్గాల్లో ఎగ్జిట్స్ ఉండేలా డిజైన్ చేయాలని నివేదించారు. రెండు విడతల్లో పనులు.. ఇప్పటికే పోలీస్స్టేషన్ల వారీగా, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అధ్యయనం పూర్తి చేసిన ట్రాఫిక్ విభాగం అధికారులు.. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రతిపాదిత పనులను సర్కారు రెండు విడతల్లో చేపట్టే అవకాశముందని పేర్కొంటున్నారు. తొలి విడతలో తక్షణం అమలు చేసే, వ్యయం తక్కువగా ఉండే వాటికి ప్రాధాన్యం ఇస్తారని చెప్తున్నారు. భారీ వ్యయం, స్థల సేకరణ వంటి అంశాలతో ముడిపడున్న పనులను రెండో విడతలో పూర్తి చేసే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
ప్చ్..!ఒక్కటీ రాలేదు
- ఎఫ్ఓబీల నిర్మాణానికి చుక్కెదురు - టెండర్లకు స్పందన కరవు - తలలు పట్టుకుంటున్న అధికారులు సాక్షి, సిటీబ్యూరో: ‘ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వచ్చేస్తున్నాయ్... ఇక ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఎంచక్కా రోడ్లు దాటవచ్చు..’ అని ఆశించిన నగర వాసులకు నిరాశే మిగులుతోంది. పాదచారుల అవస్థలు తప్పించేందుకు తొలిదశలో 50ఫుట్ఓవర్ బ్రిడ్జిల (ఎఫ్‌ఓబీలు) నిర్మాణానికి యత్నించిన జీహెచ్ఎంసీకి ఆదిలోనే చుక్కెదురైంది. వంద రోజుల్లో పది ఎఫ్‌ఓబీలను అందుబాటులోకి తేవాలని గత నవంబర్లోనే నిర్ణయించినా...ఇంతవరకూ ఒక్కటీ అందుబాటులోకి రాలేదు. అంతేకాదు.. తాజాగా ఐదు ఎఫ్ఓబీల నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఇటీవల టెండర్లు పిలిచింది. మంగళవారంతో దీనికి గడువు ముగిసింది. అయినా ఒక్క టెండరూ దాఖలు కాకపోవడంతో అధికారులు బిత్తరపోయారు. అందుకు కారణాలేమిటో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. నగరంలో పాదచారులు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రోడ్లు దాటడానికి పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైనన్ని ఎఫ్‌ఓబీలను నిర్మించాలని నిర్ణయించారు. గతంలోని ఎఫ్‌ఓబీలు కేవలం ప్రకటనల కోసం తప్ప ప్రజావసరాలకు ఉపయోగపడకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీయే వీటి నిర్మాణానికి సిద్ధమైంది. అధునాతన పద్థతిలో లిఫ్ట్ సదుపాయంతో వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అంతేకాదు.. వీటి నిర్వహణను సైతం వికలాంగులకు అప్పగించడం ద్వారా వారికి స్వయం ఉపాధి లభిస్తుందని యోచించారు. తొలి విడతగా ఐదు ప్రాంతాల్లో ఎఫ్ఓబీల నిర్మాణానికి ఒక ప్యాకేజీగా దాదాపు రూ.4.50 కోట్ల అంచనా వ్య యంతో టెండర్లు ఆహ్వానించారు. గడువు ముగి సే సమయానికి ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవడంతో పునరాలోచనలో పడ్డారు. టెండర్లు ఆహ్వానించిన ప్రాంతాలు 1. టిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్‌హౌస్ 2. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం 3. మహావీర్ హాస్పిటల్, మాసాబ్‌ట్యాంక్ 4. కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ 5. గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్, గ్రీన్హౌస్. వీటి టెండర్లు పూర్తయ్యాక మలిదశలో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-12, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, లక్డికాపూల్‌లోని అయోధ్య హోటల్, గౌలిగూడ ఇమ్లిబన్ బస్టాండ్, అబిడ్స్ బిగ్‌బజార్, కోఠి మహిళా కళాశాల తూర్పు గేటు, అఫ్జల్‌గంజ్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలను నిర్మించే యోచనలో ఉన్నారు. -
నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై దేశంలోనే పొడవైన ఎఫ్ఓబీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధానికి అత్యంత చేరువలో ఉన్న నోయిడా సిగలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. దేశంలోనే అత్యంత పొడవైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై రూపుదిద్దుకోనుంది. ఈ బ్రిడ్జి పొడవు 160 కి.మీ ఉండనుంది. దీని నిర్మాణం కోసం రూపొందించిన అంచనాను ఐఐటీ-ఢిల్లీకి పంపారు. మూడు నాలుగు నెలల వ్యవధిలో పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. దీని నిర్మాణానికి ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే కారణంగా ఓవైపు నుంచి మరో వైపునకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం ఐదు మినీ అండర్‌పాస్‌లను నిర్మించినప్పటికీ అంతదూరం నడవలేక ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను దూకి వెళ్లేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందువల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ స్థానికులు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై మొత్తం ఆరు ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలంటూ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఫారసు చేసింది. వీటిలో ఎమిటీ యూని వర్సిటీకి ఎదుట ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇప్పటికే నిర్మిం చారు. మిగతా ఐదింటిని నిర్మించాల్సి ఉంది. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను సెక్ట్టార్126 / 127 డివైడింగ్ రోడ్‌కు, సెక్టార్ 97కు మధ్య నిర్మిస్తారు.