సాక్షి, హైదరాబాద్: కింది ఫొటోలో కనిపిస్తున్నది భవనం కాదు. పాదచారులు సదుపాయంగా రోడ్డు దాటేందుకు నిర్మించనున్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నమూనా. నగరంలో పాదచారులు రోడ్డు దాటేందుకు పడుతున్న అవస్థలు, ప్రమాదాలు తగ్గించేందుకు ఇప్పటికే వివిధ చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ అందులో భాగంగా నిర్మిస్తున్న ఎఫ్‌ఓబీల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ పద్ధతిలో అధునాతనంగా ఈ ఎఫ్‌ఓబీని నిర్మించేందుకు సిద్ధమైంది.
బంజారాహిల్స్ జీవీకేమాల్ వద్ద అత్యంత ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రీడీ విధానంలో, పాదచారులు సదుపాయంగా రోడ్డు దాటేలా ఫొటోలో మాదిరి నిర్మించనుంది. పనులు పురోగతిలో ఉన్న ఈఎఫ్‌ఓబీని వీలైనంత త్వరితంగా పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రూ. 5కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ స్టీల్‌తో నిర్మిస్తున్న ఈ ఎఫ్‌ఓబీ వివరాలిలా ఉన్నాయి.
►పొడవు : 54.97 మీటర్లు.
►రెండు వైపులా లిఫ్టులు. ఒక్కో లిఫ్టులో ఒకేసారి పదిమంది వెళ్లవచ్చు.
►రెండు ఎస్కలేటర్లు
►8 సీసీకెమెరాలు
►ఇప్పటి వరకు 43 ఎఫ్‌ఓబీల పనులు చేపట్టగా వాటిల్లో 21 ఎఫ్‌ఓబీలు పూర్తయినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment