గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న సఫిపుర్ ప్రాంతంలో హెలీపోర్టుని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు
2017 కల్లా అందుబాటులోకి
గ్రేటర్ నోయిడా: గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న సఫిపుర్ ప్రాంతంలో హెలీపోర్టుని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. గ్రేటర్ నోయిడా పారిశ్రామిక అభివృద్ధి అథారిటీకి చెందిన కన్సల్టెంట్ ‘రైట్స్’ సంస్థ ఫిజిబిలిటీ నివేదికను అందజేసింది. ఈ హెలీపోర్టుని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పక్కన సఫిపుర్ వద్ద 22 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి రూ. 50 కోట్లు వ్యయం కావొచ్చని అంచనా. జెవర్ వద్ద అంతర్జాతీయ విమానశ్రయం నిర్మించాలనే ప్రతిపాదనను రద్దు చేసిన తర్వాత ఈ హెలీపోర్టు ప్రాజెక్టుని చేపట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ 2013లో జెవర్ ప్రాజెక్టుకి సమ్మతి తెలిపారు. ఆ ప్రాంతంలో శబ్ద కాలుష్యం తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తుందని రిపోర్టులు రావడంతో దానిని సఫిపుర్‌కి మార్చారు. కాగా, సఫిపుర్ ప్రాజెక్టు పనులు జూన్ నుంచి మొదలు కావొచ్చని సమాచారం. ఇది 2017 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిని మెడికల్ వంటి ఎమర్జెన్సీ సేవలతో పాటు పర్యాటక అవసరాలకు వినియోగిస్తారు. ‘ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను డీజీసీఏకు అనుమతి కోసం అందజేశామ’న్నారు.