ప్రతీకాత్మక చిత్రం
లక్నో: అపార్ట్‌మెంట్‌లోని 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. డిసెంబర్ 12 జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని పానిపట్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతి తన స్నేహితుడిని కలవడానికి నోయిడాలోని ఎన్నారై సిటీ సొసైటీకి వచ్చింది. రాత్రి పడుకున్న తరువాత బాలిక వాష్‌రూమ్ వెళ్లడానికి లేచింది. ఆ తరువాత ఏమైందో ఏమో గానీ అపార్ట్‌మెంట్‌లోని 7వ అంతస్తు కిటికి నుంచి ఒక్కసారిగా కిందపడిపయింది. దీంతో తీవ్రంగా గాయాలపాలైంది
దీనిని చూసిన స్థానికులు యువతిని రక్షించేందుకు పరుగులు పెట్టగా.. ప్రమాదం సమయంలో యువతి నగ్నంగా(వివస్త్రగా) ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు. కింద పడిపోవడంతో యువతి మెడ విరిగిపోయిందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. పస్తుతం యువతి కోమాలోకి వెళ్లిందని తెలిపారు. కాగా యువతి నిద్రమత్తులో అకస్మాత్తుగా కిటికీలోంచి కింద పడిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు
అయినప్పటికీ యువతి ప్రమాదవశాత్తు కిందపడిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరగపుతున్నారు. యువతి కోమాలోకి వెళ్లిపోవడంతో ఆమె నుంచి ఎలాంటి వివరాలు సేకరించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్పృహలోకి రాగానే నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. రోవైపు బాధిత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
చదవండి: కుమార్తె నిశ్చితార్థం రద్దు.. తండ్రి ఆత్మహత్య!
అదే విధంగా యువతి స్నేహితుడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే యువతి తనను కలిసేందుకు తరుచూ అపార్ట్‌మెంట్‌కు వస్తుంటుందని ఆమె స్నేహితుడు పోలీసులకు తెలిపారు. ఘటన జరిగిన రోజు ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. రాత్రి పడుకున్న తరువాత మద్యం మత్తులో ఉన్న బాలిక బాత్‌రూమ్ వైపు వెళ్లిందని తెలిపాడు. మద్యం మత్తులో ఆమె కిటికీ నుంచి కిందపడి ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చదవండి: అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి..
Comments
Please login to add a commentAdd a comment