గ్రేటర్ నోయిడా: భూసేకరణ వివాదం కారణంగా నాలుగేళ్లుగా ఆగిపోయిన ఆరు లేన్ల రహదారి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ఘజియాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని పొడవు 28 కిలోమీటర్లు. వెడల్పు 130 మీటర్లు. దీనిని రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించారు. గ్రేటర్ నోయిడా మాస్టర్ ప్లాన్-2021లో భాగంగా దీనిని పూర్తిచేశారు. ఇది నగరంలోని జెటా సెక్టార్ వద్ద ప్రారంభమవుతుంది. ఇందువల్ల గ్రేటర్ నోయిడా-ఘజియాబాద్ మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాల మేర తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తికి ముందు ఈ రెండు నగరాల ప్రయాణికులు ఎటైడా- చోర్పులా మార్గంలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేవారు.
భవిష్యత్తులో విస్తరణ: యమునా ఎక్స్‌ప్రెస్‌వే అథారిటీ భవిష్యత్తులో ఈ మార్గాన్ని 41 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. గ్రేటర్ నోయిడా నుంచి జేవార్ పట్టణందాకా దీనిని పొడిగించనుంది. దీంతోపాటు ఈ రహదారికి ఇరువైపులా వాణిజ్య సముదాయాలను నిర్మించనుంది. దీంతోపాటు ఓ బస్సు కారిడార్‌ను కూడా నిర్మించనుంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నాం. ఇందులోభాగంగా మోనో రైల్ లాంటి లైట్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (ఎల్‌ఆర్‌టీఎస్)ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాం. ఇందువల్ల ఈ మార్గంలోని నగరాల మధ్య కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు సులువుగా చేరుకోగలుగుతారు.
ఆరు లేన్ల రహదారి అందుబాటులోకి
Published Sun, Nov 9 2014 10:16 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
Advertisement
Advertisement