లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకంఉది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద మారుతి వ్యాన్ అదుపుతప్పి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా అయిదుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం శనివారం ఉదయం 1 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం సమయంలో వ్యానులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కోయలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమ్ అటవీ ప్రాంతంలో ఉదయం 8 గంటలకు ఛత్తీస్‌గఢ్ పోలీస్ విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్.. నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టినట్లు బస్తర్ రేంజ్ ఐడీ సుందర్రాజ్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో పోలీసుల కదలికలను గుర్తించిన మావోయిస్టులు ఎదురు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో ఐఎన్‌ఎస్‌ఏ రైఫిల్, 12 బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment