మాల్‌లో దాడి.. భారత రాయబారికి సమన్లు! | Nigeria summons Indian envoy | Sakshi
Sakshi News home page

మాల్‌లో దాడి.. భారత రాయబారికి సమన్లు!

Published Thu, Mar 30 2017 3:07 PM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM

మాల్‌లో దాడి.. భారత రాయబారికి సమన్లు! - Sakshi

మాల్‌లో దాడి.. భారత రాయబారికి సమన్లు!

అబుజా/న్యూఢిల్లీ: గ్రేటర్‌ నోయిడాలో తమ దేశస్తులపై జరిగిన దాడిని నైజీరియా తీవ్రంగా ఖండించింది. నైజీరియన్‌ విద్యార్థులపై దాడి నేపథ్యంలో తమ దేశంలోని భారత రాయాబారిని పిలిపించుకొని నిరసనను తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని  నైజీరియా ప్రభుత్వం కోరింది.

నైజీరియా విదేశాంగ మంత్రిత్వశాఖ శాశ్వత కార్యదర్శి ఒలుషోలా ఎనికనోలైయే బుధవారం దేశంలోని భారత హైకమిషనర్‌ నాగభూషణరెడ్డితో భేటీ ఈ దాడి అంశం చర్చించారు. ఈ దాడిపై భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో వెల్లడించాలని కోరారు.

సోమవారం గ్రేటర్‌ నోయిడాలో ఉన్న ఓ షాపింగ్‌ మాల్‌లో ఆఫ్రికన్లపై ఓ మూక విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మనీశ్ కారి అనే పన్నెండో తరగతి విద్యార్థి డ్రగ్స్‌ అధికంగా తీసుకొని చనిపోవడంతో స్థానికులు ఆగ్రహం చెందారు. ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద కనిపించిన నైజీరియన్లపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ  ఘటనపై వెంటనే స్పందించిన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌.. యూపీ సీఎం యోగికి ఫోన్‌ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement