దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతం బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సమీపంలో దారుణం జరిగింది.
గ్రేటర్ నోయిడా: దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతం బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సమీపంలో దారుణం జరిగింది. ఓ దుండగుడు ప్రైవేట్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని (21)ని ఇటీవల కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కారులో లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు దన్‌కౌర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అర్జున్ అనే యువకుడు యూనివర్శిటీ గేట్ వద్ద తనను కిడ్నాప్ చేసి బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ దగ్గరకు తీసుకెళ్లి కారులో దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ అరుణ్ సింగ్ చెప్పారు.