బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ! | BJP Chief JP Nadda's Wife's Toyota Fortuner Stolen in Delhi | Sakshi
Sakshi News home page

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ!

Published Mon, Mar 25 2024 1:59 PM | Last Updated on Mon, Mar 25 2024 3:14 PM

BJP Chief JP Nadda's Wife's Toyota Fortuner Stolen in Delhi - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరికి గురైంది. ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారు దొంగిలించినట్లు సమాచారం. మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.

వివరాలు.. టయోటా ఫార్చునర్‌ కారును డ్రైవర్‌ జోగిందర్‌ సర్వీసింగ్‌కు ఇచ్చి తీసుకొచ్చారు. నడ్డా నివాసానికి వెళ్తుండగా మధ్యలో తన ఇంటి వద్ద భోజనం కోసం కారును బయట నిలిపి ఉంచాడు.  భోజనం చేసి వచ్చే సరికి ఇంటి ముందు ఆపిన  కారు కనిపించలేదు. దుండగులు కారును అపహరించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్రైవర్‌.

రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కారుకోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు.. కారును గురుగ్రామ్‌ వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అపహరణకు గురైన కారు హిమాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఉంది. ఆరు రోజులైనా ఇప్పటి వరకూ కారు ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ‘కంగన’కు బీజేపీ టికెట్‌.. నటి పాత ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement