యువన్‌ శంకర్‌రాజా కారు చోరీ | Music director Yuvan Shankar Rajas Audi stolen | Sakshi
Sakshi News home page

యువన్‌ శంకర్‌రాజా కారు చోరీ

Apr 4 2018 9:58 AM | Updated on Apr 4 2018 9:58 AM

Music director Yuvan Shankar Rajas Audi stolen - Sakshi

పెరంబూరు:సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజాకు చెందిన ఖరీదైన కారు అపహరణకు గురైంది. వివరాల్లోకెళితే ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఇళయరాజా కొడుకు, యువ సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా స్థానిక ఎతిరాజ్‌ రోడ్డులోని ఇంట్లో నివశిస్తున్నారు.ఆయన వద్ద నవాజ్‌ఖాన్‌ అనే వ్యక్తి కారు డైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్‌ నవాజ్‌ఖాన్‌ కారును బయటకు తీసుకెళ్లి అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు.

యువన్‌శంకర్‌రాజా కూడా ఇంటి వద్ద లేకపోవడంతో కారు దొంగిలించబడిందన్న సందేహంతో ఆయన తరఫున ఎంగ్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి పరిస్థితిలో మంగళవారం వేకువజామున డ్రైవర్‌ నవాజ్‌ఖాన్‌ కారుతో యువన్‌శంకర్‌రాజా ఇంటికి తిరిగి వచ్చాడు. అతను కారును ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎందుకు తీసుకెళ్లాడు. అన్న విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కారు లభించడంతో యువన్‌శంకర్‌రాజా ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement