చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాకు చెందిన ఖరీదైన కారు చోరీ కేసులో ఆసక్తికరమైన ట్విస్టు వెలుగుచూసింది. యువన్‌శంకర్‌రాజా డైవర్ నవాజ్‌ఖాన్ కారును దొంగలించినట్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైన సంగతి తెలిసిందే. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరా దృశ్యాలను తమకు చూపించాలని యువన్ సతీమణి జఫ్రూన్ నిసాను పోలీసులు కోరారు. సీసీటీవీ కెమెరాలు చూడటంతో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. చోరీకి గురైనట్టు భావిస్తున్న కారు యువన్ నివాసంలోనే లెవల్-2కు బదులు లెవల్ -3లో పార్క్ చేసి ఉంది. వెంటనే కారు దగ్గరికి వెళ్లి చూడగా.. అందులో డ్రైవర్ నవాజ్ ఖాన్ ఇంకా పడుకొని ఉన్నాడు. ఏమైందని డ్రైవర్‌ను ఆరాతీయగా తాను కారులో నిద్రపోయానని, ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో కాల్స్ రాలేదని అతను చెప్పాడు. దీంతో షాక్ తినడం యువన్ భార్య నిసా, పోలీసుల వంతైంది.
పొరబడటం వల్లేనా!?
సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్ నవాజ్‌ఖాన్ యువన్‌కు చెందిన లగ్జరీ కారు ఆడీ-6ను బయటకు తీసుకువెళ్లాడు. తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగివచ్చిన జఫ్రూన్ నిసా ఇంట్లోని లెవల్-3లో కారు పార్క్ చేసి లేకపోవడంతో సందేహించింది. యువన్‌శంకర్‌రాజా కూడా ఇంటివద్ద లేకపోవడంతో కారు చోరీకి గురైందేమోనన్న అనుమానంతో వెంటనే ఎంగ్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి అయినా కారు తిరిగిరాకపోవడం, డ్రైవర్‌కు ఫోన్ చేస్తే కలువకపోవడం వల్ల ఆమె పొరబడి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోందని స్థానిక మీడియా కథనాలు వస్తున్నాయి. తీరా కారు, డ్రైవర్‌తో సహా ఇంట్లోనే ఉండటంతో ఫిర్యాదును వెనుకకు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment