
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అదుపులో ఇద్దరు నిందితులు
రుద్రవరం:
రుద్రవరం అటవీ రేంజి పరిధిలోని ఆర్ క్రిష్ణాపురం గ్రామ సమీపంలో రెండు వాహనాలతోసహా 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు రేంజర్ రామ్‌సింగ్ తెలిపారు. ఆదివారం స్థానిక అటవీశాఖ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు రేంజర్ తెలిపిన వివరాల మేరకు.. మిట్టపల్లె బీటు సమీపంలోని నగిరి బావి ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నిల్వ ఉంచి శనివారం రాత్రి ఏపి02 ఏజీ 9592 నెంబరుగల స్కార్పియోలో ఆళ్లగడ్డ వైపు అక్రమ రవాణా చేస్తున్నట్లు ఓ వ్యక్తి రహస్య సమాచారం అందించాడు.
వెంటనే ఆర్ క్రిష్ణాపురం, ఆలమూరు, చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో అటవీ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున అహోబిలం నుంచి ఆర్ క్రిష్ణాపురం వస్తున్న స్కార్పియోను ఆగకుండా వేగంగా వెళ్లిపోవడంతో ఛేజింగ్ చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో ఆర్ క్రిష్ణాపురం గ్రామ సమీపంలోని దిబ్బల్లో స్కార్పియో ఇరుక్కుపోయింది. వాహనం డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్నారు. వాహనాన్ని పరిశీలించి చూడగా 11 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, మోటర్ సైకిల్‌పై స్కార్పియోను ఫాలో అవుతున్న మరో వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు.
మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన ఇద్దరిలోఒకరు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సాయినాథ్, మరొకరు పట్టణ సమీపంలోని పర్లపాడుకు చెందిన సుధాకర్ అని ప్రాథమిక విచారణలో తేలింది. వాహనాలతో సహా ఎర్రచందనం దుంగలను రుద్రవరం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. పరారైన వారు వ్యక్తులు ఆళ్లగడ్డ మండలం దొరకొట్టాలకు చెందిన లూథయ్య, రాజుగా గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసి త్వరలో అదుపులోనికి తీసుకుంటామని రేంజర్ తెలిపారు. స్కార్పియో, మోటర్ సైకిల్‌తో సహా ఎర్రచందనం దుంగల విలువ * 8 లక్షలు ఉంటుందని రేంజర్ తెలిపారు. ఈ దాడుల్లో ఆలమూరు సెక్షన్ అధికారి విజయలక్ష్మి, సిబ్బంది టి.రామకృష్ణ, పకృద్దీన్, పెద్దన్న, పలువురు ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.