logs
-
ఇద్దరు ఎర్రస్మగ్లర్లు అరెస్ట్
సంబేపల్లె: వేర్వేరు చోట్ల ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 దుంగలు, ఒక సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజు తెలిపారు. ఆదివారం సంబేపల్లె పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. దుద్యాల గ్రామ సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని ముందస్తు సమాచారం అందడంతో శనివారం సంబేపల్లె ఎస్ఐ సయ్యద్ హాషం తమ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలోనే దుద్యాల వైపు నుంచి టాటా సుమో వాహనం సంబేపల్లె వైపు అతి వేగంగా వస్తుండటంతో పోలీసులు దానిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించారు. సుమోలో ఉన్న ఎర్ర దొంగలు పోలీసులపై రాళ్లురువ్వి, దాడిచేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా తప్పించుకొని చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన సయ్యద్నదీమ్ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పారిపోయారు. మరో సంఘనటలోదుద్యాల గ్రామం కొత్తపురమ్మ ఆలయం ఆర్చి సమీపంలో ఎర్రచందనం దుంగలు గోనె సంచిలో వేసుకుని వెళ్తున్న పుల్లగూర మోహన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రెండు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
మరోసారి టాప్ లో మారుతి
ప్రముఖ దేశీ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మరోసారి సత్తా చాటింది. ఆగస్ట్ నెలలో ఆకర్షణీయ అమ్మకాలతో టాపర్ గా నిలిచింది. కార్ల తయారీ దిగ్గజం సుజుకి భారతదేశం లిమిటెడ్ ఆగస్టు విక్రయాలలో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో 132,211 యూనిట్ల (119.931 డొమెస్టిక్/ 12,280 ఎగుమతులు) ను విక్రయించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. గత ఏడాది 117,864 యూనిట్ల (106,781 / 11,083) గా ఉన్నాయి. ప్రయాణికుల వాహనాల మొత్తం అమ్మకాలు 12.2 శాతం పెరిగి 1.3 లక్షల యూనిట్లను తాకాయి. వీటిలో దేశీ అమ్మకాలు 12.3 శాతం వృద్ధితో 1.19 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే 10.8 శాతం వృద్ధితో 12,280 యూనిట్లను ఎగుమతి చేసింది. అలాగే యుటిలిటీ వాహనాల విక్రయాలు 114.5 శాతం వృద్ధితో16.806 యూనిట్లకు పెరిగాయి. మధ్యస్థాయి కార్ల సెగ్మెంట్ సియాజ్, కాంపాక్ట్ సెగ్మెంటో విభాగంలోస్విఫ్ట్, రిట్జ్, బాలెనో, సెలెరియో, డిజైర్ అమ్మకాలు కూడా వృద్ధి పొందాయి. అయితే ఆగష్టు 2015 అమ్మకాలు పోలిస్తే మారుతి సుజుకి దాని మినీ సెగ్మెంట్ లో మాత్రం కొద్దిగా తగ్గుదలనునమోదుచేసింది.వృద్ధిని ఆల్టో, వ్యాగన్ ఆర్, సూపర్ కాంపాక్ట్ సెగ్మెంట్లో (డిజైర్ టూర్) గత నెలలో అమ్మకాలు క్షీణించాయి. వచ్చే మూడు నెలల పండుగ సీజన్, ఏడవ వేతన కమిషన్ సిఫారసులు అమలు, మంచి వాతావరణ పరిస్థితులు, తదితర కీలక అంశాల కారణంగా ప్రత్యేక మెడల్స్ లో డిమాండ్ మరింత పుంజుకునే అవకాశాలున్నాయని పార్ట్ నర్ వాటర్ హౌస్ కు చెందిన అబ్దుల్ మజీద్ తెలిపారు. డీజిల్ వాహనాలపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో యూజర్లు డీజిల్ తో పోలిస్తే.. పెట్రోల్ ఇంజీన్ కార్లవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలో మారుతి స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్టు మారుతి సుజుకి ఎండీ కెనిచి అయుక్వా తెలిపారు. దీపావళి కి ముందు మరిన్ని వాహనాలను డెలీవరీ చేయాల్సి ఉందన్నారు. మరో ఆరు నెలల్లో గుజరాత్ లోని తమ ప్లాంట్ రడీ అవనున్నట్టు ఆయన వెల్లడించారు. భద్రతా ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తే రాబోయేరెండేళ్లలో కార్ల ధరలుమరింత పెరుగుతాయని చెప్పారు. -
సయాటిక
ప్రస్తుతం మానవ జీవితం యాంత్రికంగా మారింది. ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్నవిపర్యయం (పగటి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాల్లో మార్పులు రావటం వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలతో వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యమైంది కటిశూల (నడుమునొప్పి). 90 శాతం మంది తమ జీవితకాలంలో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో చరక, సుశ్రుత, బాగ్బటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటిక)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు. సాధారణ కారణాలు పరిశీలిస్తే.. ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చోవటం, స్థూలకా యం, అధిక శ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయడం, అధిక బరువులను మోయటం, ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక, వంశపారంపర్య వ్యాధులు, రోడ్డు ప్రమాదాల వల్ల నడుము నొప్పి సమస్య వస్తుంది. ఈ కారణాల వల్ల శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్దత, నొప్పి కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే సయాటిక (గుద్రసీవాతము) అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువవుతుంది. నడుముకు సంబంధించిన ఎల్4, ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూస మధ్యగల సయాటిక అనే నరంపై ఒత్తిడి పడటంవల్ల నొప్పి వస్తుంది. డిస్క్‌లో మార్పులు: ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో మార్పులొస్తాయి. డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగి పోవటం వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్‌లో వాపు వస్తే దాన్లో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంటలతో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనదైతే స్పర్శ హాని కూడా కలగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుం టారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. ఆయుర్వేద చికిత్స: ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స, 2. శోధన చికిత్స. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధచికిత్స ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: దీనివల్ల ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగబెట్టవచ్చు. ఆయుర్వేదంలో పంచకర్మ ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. జాగ్రత్తలు: సరైన పోషకాహారం తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు. డాక్టర్ మనోహర్. ఎం.డీ ఆయర్వేద. స్టార్ ఆయుర్వేద ఫోన్.7416102102 www.starayurveda.com -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అదుపులో ఇద్దరు నిందితులు రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజి పరిధిలోని ఆర్ క్రిష్ణాపురం గ్రామ సమీపంలో రెండు వాహనాలతోసహా 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు రేంజర్ రామ్‌సింగ్ తెలిపారు. ఆదివారం స్థానిక అటవీశాఖ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు రేంజర్ తెలిపిన వివరాల మేరకు.. మిట్టపల్లె బీటు సమీపంలోని నగిరి బావి ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నిల్వ ఉంచి శనివారం రాత్రి ఏపి02 ఏజీ 9592 నెంబరుగల స్కార్పియోలో ఆళ్లగడ్డ వైపు అక్రమ రవాణా చేస్తున్నట్లు ఓ వ్యక్తి రహస్య సమాచారం అందించాడు. వెంటనే ఆర్ క్రిష్ణాపురం, ఆలమూరు, చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో అటవీ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున అహోబిలం నుంచి ఆర్ క్రిష్ణాపురం వస్తున్న స్కార్పియోను ఆగకుండా వేగంగా వెళ్లిపోవడంతో ఛేజింగ్ చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో ఆర్ క్రిష్ణాపురం గ్రామ సమీపంలోని దిబ్బల్లో స్కార్పియో ఇరుక్కుపోయింది. వాహనం డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్నారు. వాహనాన్ని పరిశీలించి చూడగా 11 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, మోటర్ సైకిల్‌పై స్కార్పియోను ఫాలో అవుతున్న మరో వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన ఇద్దరిలోఒకరు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సాయినాథ్, మరొకరు పట్టణ సమీపంలోని పర్లపాడుకు చెందిన సుధాకర్ అని ప్రాథమిక విచారణలో తేలింది. వాహనాలతో సహా ఎర్రచందనం దుంగలను రుద్రవరం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. పరారైన వారు వ్యక్తులు ఆళ్లగడ్డ మండలం దొరకొట్టాలకు చెందిన లూథయ్య, రాజుగా గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసి త్వరలో అదుపులోనికి తీసుకుంటామని రేంజర్ తెలిపారు. స్కార్పియో, మోటర్ సైకిల్‌తో సహా ఎర్రచందనం దుంగల విలువ * 8 లక్షలు ఉంటుందని రేంజర్ తెలిపారు. ఈ దాడుల్లో ఆలమూరు సెక్షన్ అధికారి విజయలక్ష్మి, సిబ్బంది టి.రామకృష్ణ, పకృద్దీన్, పెద్దన్న, పలువురు ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.