సయాటిక | Currently, human life has become mechanical | Sakshi
Sakshi News home page

సయాటిక

Published Mon, Dec 15 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

సయాటిక

సయాటిక

ప్రస్తుతం మానవ జీవితం యాంత్రికంగా మారింది. ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్నవిపర్యయం (పగటి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాల్లో మార్పులు రావటం వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలతో వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యమైంది కటిశూల (నడుమునొప్పి). 90 శాతం మంది తమ జీవితకాలంలో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో చరక, సుశ్రుత, బాగ్బటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటిక)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు.
 
సాధారణ కారణాలు పరిశీలిస్తే.. ఎక్కువగా ఒకే పొజిషన్‌లో కూర్చోవటం, స్థూలకా యం, అధిక శ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయడం, అధిక బరువులను మోయటం, ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక, వంశపారంపర్య వ్యాధులు, రోడ్డు ప్రమాదాల వల్ల నడుము నొప్పి సమస్య వస్తుంది. ఈ కారణాల వల్ల శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్దత, నొప్పి కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే సయాటిక (గుద్రసీవాతము) అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువవుతుంది. నడుముకు సంబంధించిన ఎల్4, ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూస మధ్యగల సయాటిక అనే నరంపై ఒత్తిడి పడటంవల్ల నొప్పి వస్తుంది.
 
డిస్క్‌లో మార్పులు: ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో మార్పులొస్తాయి. డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్‌కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగి పోవటం వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్‌లో వాపు వస్తే దాన్లో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది.
 
లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంటలతో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనదైతే స్పర్శ హాని కూడా కలగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుం టారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు.
 
ఆయుర్వేద చికిత్స: ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స, 2. శోధన చికిత్స.
 
శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధచికిత్స ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి.
 
శోధన చికిత్స: దీనివల్ల ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగబెట్టవచ్చు. ఆయుర్వేదంలో పంచకర్మ ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు.
 
జాగ్రత్తలు: సరైన పోషకాహారం తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు.
 
 డాక్టర్ మనోహర్. ఎం.డీ ఆయర్వేద.
 స్టార్ ఆయుర్వేద

 
 ఫోన్.7416102102   
www.starayurveda.com
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement