భోపాల్: దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి పేరేత్తగానే ప్రతిఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. కానీ ఒక శతాధిక వృద్ధుడు కరోనాను జయించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్‌లోని బెతుల్‌కి చెందిన 103 ఏళ్ల బిర్దిచంద్ అనే వృద్ధుడు ఈనెల 5న కరోనా బారిన పడ్డాడు.
కోవిడ్ లక్షణాలున్నప్పటికి బిర్దిచంద్ ఏమాత్రం భయపడలేదు. ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పాజిటీవిటిగా ఉండటం వల్ల ఆయన వైరస్‌ను జయించాడని బిర్దిచంద్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా, చంద్ మాట్లాడుతూ.. ‘నేను అప్పట్లో.. స్వాతంత్రోద్యమంలో ఆంగ్లేయులతో పోరాడి విజయం సాధించినట్లే... ఇప్పుడు, కరోనాపై పోరాడి విజయం సాధించానని’ పేర్కొన్నాడు. అయితే, చింద్వారాకు చెందిన ఒక డాక్టర్ సలహా మేరకు మాత్రం కొన్ని మందులు వాడినట్లు చంద్ తెలిపాడు. కాగా ఆధార్ కార్డు ప్రకారం ఈయన 1917 నవంబరు 2 న జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment