
25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
కరీంనగర్: నగరంలోని భవానీనగర్‌ను పోలీసులు దిగ్బంధించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు వేకువజామున గిద్దెపెరుమాండ్లస్వామి ఆలయం వెనుక బాగంలోని భవానీనగర్‌ను చుట్టుముట్టి ఇంటింటా సోదాలు నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన బియ్యంను గుర్తించి సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించారు. పాపడ్, ఖారా తయారు చేసే దుకాణాన్ని గుర్తించి నాణ్యతా ప్రమాణాలు లేవని దీనిపై విచారణకు పుడ్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. పలువురు అనుమానితులను విచారించారు. అక్రమంగా మద్యం విక్రయించే మహిళను అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్ళను సీజ్ చేశారు.