ముగ్గురి కిడ్నాప్.. దారుణ హత్య | Bodies of kidnapped people recovered in Meghalaya | Sakshi
Sakshi News home page

ముగ్గురి కిడ్నాప్.. దారుణ హత్య

Published Fri, Sep 9 2016 10:19 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

ముగ్గురి కిడ్నాప్.. దారుణ హత్య - Sakshi

ముగ్గురి కిడ్నాప్.. దారుణ హత్య

తురా: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో డిప్లిపారా అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను గురువారం పోలీసులు గుర్తించారు. ఓ మైనర్ బాలుడితో సహా మరో ఇద్దరిని ఆగస్టు 27న కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసి చివరికి దారుణంగా హతమార్చారని జిల్లా పోలీస్ అధికారి ముఖేష్ సింగ్ వెల్లడించారు.

సులైమాన్ షేక్(15), జితూ రిషి, బాల్సరంగ్ అనే ముగ్గురు వ్యక్తులను దుండగులు అపహరించారు. ముగ్గురిని విడిచిపెట్టాలంటే 30 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. అయితే కిడ్నాప్కు గురైన వారి తల్లిదండ్రులు అంత డబ్బు లేదని చెప్పడంతో కిడ్నాపర్లు మూడు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కిడ్నాప్కు గురైన వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు సైతం చేయలేదని తెలుస్తోంది.  మరో కేసు విషయంలో దాడులు నిర్వహించిన పోలీసులు కిడ్నాపర్ల ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ముగ్గురి మృతదేహాలను గురువారం డిప్లిపారా అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఈ ఘటనలో కిడ్నాపర్ల ముఠాలోని మరికొందరిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి ముఖేష్ సింగ్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement